iDreamPost

RRR & KGF Chapter 2 : కొత్త పోకడకు దారి తీస్తున్న ఫ్యాన్ వార్స్

RRR & KGF Chapter 2 : కొత్త పోకడకు దారి తీస్తున్న ఫ్యాన్ వార్స్

సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ మరీ విచిత్రంగా తయారవుతున్నాయి. టాపిక్ ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్ళిపోతోంది. విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ కు చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారని అక్కడి బాషా ప్రేమికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బాయ్ కాట్ ఆర్ఆర్ఆర్ అంటూ ట్రెండింగ్ కూడా మొదలుపెట్టారు. దీంతో సహజంగానే చరణ్ తారక్ ఫ్యాన్స్ కు కోపం వచ్చేసింది. మీరు ఇప్పుడు ట్రిపులార్ మీద నెగటివ్ ఏదైనా స్టార్ట్ చేస్తే మేము తర్వాత కెజిఎఫ్ 2తో ఇలాగే ఆడుకుంటామని, ఇక్కడి కలెక్షన్లు ఎంత కీలకమో గుర్తు చేయాల్సిన పని లేదని గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఇది మెల్లగా రాజుకుంటోంది.

కర్ణాటకలో సమస్య కేవలం డబ్బింగ్ వెర్షన్ తోనే రాలేదు. పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ ని తీసేసి ఆర్ఆర్ఆర్ వేయాలని కొందరు డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకోవడం అభిమానులకు నచ్చలేదు. అది కొనసాగిస్తూనే ఆర్ఆర్ఆర్ ని అడ్జస్ట్ చేయాలని లేకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయని కొందరు ఏకంగా మీడియా ముందుకు రావడం వాతావరణాన్ని వేడెక్కించింది. దెబ్బకు అక్కడి ఆర్ఆర్ఆర్ హక్కులు సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ ప్రత్యేకంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి కన్నడకే ప్రాధాన్యం ఇచ్చి స్క్రీన్లు పెంచుతామని చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలు ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తాయని చెప్పలేం.

ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 ల మధ్య కేవలం 20 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. ఆన్ లైన్ వేదికగా ఇలాంటివి జరగడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఇండియా మూవీగా ప్రమోట్ అవుతున్న ఆర్ఆర్ఆర్ ని ఇలా బాయ్ కాట్ చేయమని పిలుపు ఇవ్వడం కరెక్ట్ కాదు. సహజంగానే కర్ణాటకలో ముందు నుంచి తెలుగు సినిమాల స్ట్రెయిట్ వెర్షన్లకే డిమాండ్ ఎక్కువ. అందుకే ఎగ్జిబిటర్లు వాటిని వేసుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు కావాలంటే కన్నడ ప్రింట్లు పెంచుకోవచ్చు. అంతే తప్ప అసలు రిలీజ్ కాక ముందే ఇంత గొడవ చేయడం న్యాయం కాదు. చూడాలి మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో

Also Read : Disha Patani : ఐకాన్ స్టార్ సరసన భాగీ బ్యూటీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి