iDreamPost

RRR : రాజమౌళి 6 ప్యాక్ సక్సెస్ ఫార్ములా ఇదే

RRR : రాజమౌళి 6 ప్యాక్ సక్సెస్ ఫార్ములా ఇదే

25 ఉదయం ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో అయ్యాక కొంత డివైడ్ టాక్ నడిచిన ఆర్ఆర్ఆర్ మాయాజాలం ముందు బాక్సాఫీస్ రికార్డులు దాసోహం అంటున్నాయి. బాహుబలి 2ని ఇంత సులభంగా క్రాస్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు విశ్లేషకులు నాన్ స్టాప్ గా రాజమౌళిని ఆయన ఇద్దరు హీరోలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు యునానిమస్ బ్లాక్ బస్టర్ దిశగా ట్రిపులార్ పరుగులు పెడుతోంది. ఇంత విజయానికి దారి తీసిన ఆరు సూత్రాలేంటో ఓసారి చూద్దాం.

1. తారక్ చరణ్ కాంబినేషన్

అసలు కొణిదెల నందమూరి కుటుంబాల నుంచి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ జక్కన్న దాన్ని సాధ్యం చేయడమే కాదు ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాను ఎంచుకోకుండా రిస్క్ చేసి ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ ని తీసుకోవడం అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. నార్త్ ఆడియన్స్ సైతం ఈ కాన్సెప్ట్ కి విపరీతంగా కనెక్ట్ అయిపోయి జేజేలు కొడుతున్నారు

2. విజువల్ ఎఫెక్ట్స్

జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రోలో పులితో ఫైట్, ఇంటర్వెల్ కు ముందు జంతువులతో కలిసి తారక్ బ్రిటిషర్ల పార్టీ మీద దాడి చేయడం లాంటి ఎపిసోడ్స్ మాములు గూస్ బంప్స్ ఇవ్వలేదు. క్లైమాక్స్ లోనూ ఈ ఎఫెక్ట్స్ కి స్టన్నింగ్ అనే మాట చిన్నదే. టాప్ టెక్నీషియన్స్ తో బెస్ట్ అవుట్ ఫుట్ రావడానికి రాజమౌళి బృందం చేసిన కృషి అంతర్జాతీయంగా పేరు తెస్తోంది

3. తారక్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్

అమాయకత్వం నిండిన కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తీరు ప్రతిఒక్కరితో వావ్ అనిపించుకుంది. భయ్యా భయ్యా అంటూ చరణ్ తో తను పండించిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, కొమురం భీముడో పాటలో చూపించిన ఎమోషన్స్ నేషనల్ అవార్డు ఖాయమనే అంచనాలు పెంచేశాయి. తన పెర్ఫార్మన్స్ కు అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు

4. అల్లూరి కటవుట్ కి ఫిదా

రంగస్థలంని మించిన క్యారెక్టర్ రామ్ చరణ్ మళ్ళీ దక్కించుకోలేడమో అనే కామెంట్లను బ్రేక్ చేస్తూ ఆర్ఆర్ఆర్ లో మెగా పవర్ స్టార్ చూపించిన విశ్వరూపం ఫ్యాన్స్ సెలబ్రేషన్ ని ఇంకో లెవెల్ కు తీసుకెళ్లింది. క్లైమాక్స్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో తనను చూసి థియేటర్లో జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. ఇంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంటుంది

5. నెవర్ బిఫోర్ ప్రమోషన్

బహుశా ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఆర్ఆర్ఆర్ కు చేసినంత ప్రమోషన్ దేనికీ జరగలేదన్నది వాస్తవం. ఢిల్లీ నేషనల్ మీడియాతో మొదలుపెట్టి చిన్నపాటి యుట్యూబ్ ఛానల్స్ దాకా ఎన్ని ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, ప్రోగ్రాంలు చేశారో లెక్క బెట్టడం కష్టం. కేవలం వీటి కోసమే పదిహేను కోట్ల దాకా ఖర్చు పెట్టారని టాక్. ఇంత చేసినా దానికి మించిన గొప్ప ఫలితం దక్కిందిగా

6. లాస్ట్ బట్ నాట్ లీస్ట్

ఇవన్నీ ఎలా ఉన్నా కెప్టెన్ అఫ్ ది షిప్ రాజమౌళికి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. తాను అనుకున్న ఒక విజన్ ని తెరమీద ఈ స్థాయిలో ఆవిష్కరించిన తీరు భవిష్యత్తు దర్శకులకు ఒక గొప్ప పాఠంగా నిలిచిపోతుంది. రాష్ట్రాల మధ్య సినిమాలకు హద్దులు ఉండవనే సత్యాన్ని నిరూపించి తీసిన 12 సినిమాల్లో అపజయమెరుగని దర్శకుడిగా తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు

Also Read : Bheemla Nayak OTT : ఓటిటి సినిమా కోసం ఈ రేంజ్ హడావిడా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి