iDreamPost

Rohit Sharma Records: ఆఫ్గాన్ పై సెంచరీతో రోహిత్ నయా రికార్డ్.. చరిత్రలో ఒకే ఒక్కడిగా!

చిన్నస్వామి స్టేడియంలో ఆఫ్గనిస్తాన్ పై రోహిత్ శర్మ శతకంతో విజృంభించడమే కాకుండా అద్భుతమైన రికార్డులు నెలకొల్పాడు.

చిన్నస్వామి స్టేడియంలో ఆఫ్గనిస్తాన్ పై రోహిత్ శర్మ శతకంతో విజృంభించడమే కాకుండా అద్భుతమైన రికార్డులు నెలకొల్పాడు.

Rohit Sharma Records: ఆఫ్గాన్ పై సెంచరీతో రోహిత్ నయా రికార్డ్.. చరిత్రలో ఒకే ఒక్కడిగా!

హిట్ మ్యాన్.. ఈ పేరు ఊరికే రాలేదు. అతను మైదానంలోకి దిగితే పరుగుల వరద పారుతుంది. ఫార్మాట్ ఏదైనా తన బ్యాటుతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ఉంటాడు. ఒక్కోసారి మైదానంలో తాండవం చేస్తుంటాడు. ఇప్పుడు రోహిత్ శర్మ విజృంభణకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికైంది. ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. బ్యాటును ఝళిపించడమే కాకుండా.. సరికొత్త రికార్డులు కూడా నెలకొల్పాడు. బ్యాటింగ్ తో ఆడియన్స్ ని అలరించడమే కాకుండా.. టీ20ల్లో నయా రికార్డు క్రియేట్ చేశాడు.

రోహిత్ శర్మ పేరు వినగానే అందరికీ ఫోర్లు, సిక్సర్లే గుర్తొస్తాయి. గత కొన్ని మ్యాచుల నుంచి రోహిత్ శర్మ 2.0 వర్షన్ చూస్తున్న విషయం తెలిసిందే. క్రీజులోకి వచ్చింది మొదలు బౌలర్లపై అదే పనిగా విరుచుకుపడుతున్నాడు. ఈసారి రోహిత్ దాటికి ఆఫ్గాన్ బౌలర్లు బలైపోయారు. మ్యాచ్ సాగినంతసేపు రోహిత్ ఎప్పుడు అవుటవుతాడా అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. రోహిత్ విశ్వరూపం చూసి.. టీమిండియా ఫ్యాన్స్ కూడా ఆఫ్గాన్ బౌలర్లను తల్చుకుని అయ్యో అనే పరిస్థితి వచ్చింది. మైదానంలో ఏ మూలనూ వదలకుండా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. ఈ కెప్టన్ ఇన్నింగ్స్ తో టీమిండియాకి అద్భుతమైన స్కోర్ అందిచడమే కాకుండా.. వ్యక్తిగతంగా పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఒక్కడిగా రికార్డులకెక్కాడు.

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మొత్తం 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ శతకం టీమ్ కి మాత్రమే కాదు.. రోహిత్ శర్మాకి కూడా ఎంతో స్పెషల్. ఎందుకంటే ఈ సెంచరీతో రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆఫ్గాన్ పై చేసిన సెంచరీతో రోహిత్ ఇంటర్నేషనల్ టీ20ల్లో ఇప్పటివరకు 5 శతకాలు నమోదు చేశాడు. రోహిత్ తర్వాత సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ చెరో 4 శతకాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 2019 జనవరి తర్వాత అన్ని టీ20ల్లో రోహిత్ శర్మ శతకం చేయడం ఇదే ప్రథమం.

అత్యధిక సెంచరీల రికార్డు మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఈ ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ కెప్టెన్ గా మొత్తం 1647 పరుగులు స్కోర్ చేశాడు. తర్వాతి స్థానంలో 1570 పరుగులతో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఆ తర్వా 1112 పరుగులతో కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ ఉన్నాడు. ఇవి మాత్రమే కాకుండా టీ20ల్లో ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. రింకూ సింగ్(69 నాటౌట్)తో కలిసి రోహిత్ శర్మ 190 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్ శర్మ, రింకూ సింగ్ విజృంభించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. మరి.. రోహిత్ శర్మ నెలకొల్పిన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 

Gulbadin Naib: చివరి T20లో భారత బౌలర్లను భయపెట్టాడు.. ఎవరీ గుల్బదీన్ నయీబ్?

Rohit Sharma: విధ్వంసకర సెంచరీ చేసి.. రోహిత్‌ ఎందుకు సెలబ్రేట్‌ చేసుకోలేదు! కారణం?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి