SNP
Rohit Sharma, Hardik Pandya, T20 World Cup 2024: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను టీ20 వరల్డ్ కప్‌లోకి తీసుకోవడానికి రోహిత్ శర్మ ఇష్టపడలేదంటా.. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rohit Sharma, Hardik Pandya, T20 World Cup 2024: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను టీ20 వరల్డ్ కప్‌లోకి తీసుకోవడానికి రోహిత్ శర్మ ఇష్టపడలేదంటా.. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SNP
ఐపీఎల్ 2024 కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్‌పై అందరికి ఆసక్తి నెలకొంది. క్రికెట్ అభిమానుల ఫోకస్ మొత్తం ఐపీఎల్‌పై ఉంటే.. మరోవైపు టీమిండియాకు సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత సెలెక్టర్లు 15 మందితో కూడిన టీ20 స్క్వౌడ్‌ను ప్రకటించారు. అయితే.. ఈ టీమ్‌లో హార్దిక్ పాండ్యా అవసరం లేదని రోహిత్ శర్మ ఒత్తిడి తెచ్చాడనే సంచలన విషయం బయటికి వచ్చింది.
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయకూడదని టీమిండియా కెప్టెన్ రోహిత్ గట్టిగా పట్టుబట్టాడని సమాచారం. చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్ కూడా రోహిత్‌కు మద్దతు పలుకుతూ.. పాండ్యాను టీమ్‌లోకి తీసుకోకూడదని అనుకున్నాడంటా.. కానీ భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా హార్దిక్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా చేయాలనుకొంటున్న బీసీసీఐ.. అతను టీమ్‌లో కచ్చితంగా ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. ఈ విషయమై రోహిత్‌తో పాటు, అగార్కర్‌పై ఒత్తిడి తెచ్చి హార్దిక్‌ను జట్టులో చేర్చిందట.
అయితే.. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా అంత మంచి ఫామ్‌లో లేని విషయం తెలిసిందే. పైగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా మధ్య గ్యాప్ వచ్చింది. గుజరాత్ టీమ్ నుంచి ముంబైలోకి తిరిగి వచ్చిన పాండ్యాకు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ అప్పగించిన విషయం తెలిసిందే. దీనిపై రోహిత్ ఆగ్రహంగా ఉన్నాడు. పైగా పాండ్యా ఫామ్‌లో లేకపోవడంతో.. అతన్ని టీమ్‌లోకి తీసుకోకూడదని రోహిత్ భావించినట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MI Camp Divided? Rohit Sharma, Suryakumar Yadav Leave As Hardik Pandya Comes To Bat: Report#IPL2024 #MumbaiIndianshttps://t.co/HQp0pNGt5v pic.twitter.com/eP0gHre25v
— CricketNDTV (@CricketNDTV) May 14, 2024