iDreamPost

హైదరాబాద్ లో భారీ దోపిడి..25 తులాల బంగారం చోరీ!

Hyderabad Crime: ఇటీవల కాలంలో దొంగతనాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పట్టపగలే ఇలాంటి దోపిడీ ఘటనలు జరుగుతుండటంతో అందరు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ భారీ దోపిడి జరిగింది.

Hyderabad Crime: ఇటీవల కాలంలో దొంగతనాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పట్టపగలే ఇలాంటి దోపిడీ ఘటనలు జరుగుతుండటంతో అందరు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ భారీ దోపిడి జరిగింది.

హైదరాబాద్ లో భారీ దోపిడి..25 తులాల బంగారం చోరీ!

ప్రస్తుత సమాజంలో  నిజాయితీగా సంపాదించే  డబ్బుల కంటే అక్రమంగా పొందేందుకు ఆరాటపడే వారి సంఖ్య పెరిగిపోతుంది. కష్టపడి పనిచేయడం చేతకాక, ఇతరులు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును దొగిలిస్తుంటారు. ఇళ్లు, షాపులు, బ్యాంకులు.. ఇలా అనేక చోట్ల దొంగతనాలు చేస్తూ అందినకాడికి చోరీ చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే..కొందరు దుండగులు పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో అడ్డు వచ్చిన వారిని సైతం తీవ్రంగా గాయపరుస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరగ్గా.. తాజాగా మరో ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని మలక్ పేట్ ప్రాంతంలో పట్టపగలే ఓ భారీ దోపిడీ చోటుచేసుకుంది. మలక్ పేట్ లో ఉన్న ఓ నగల దుకాణంలోకి ముగ్గురు దుండగలు ప్రవేశించి బంగారు నగలను చోరీ చేశారు. మలక్ పేట్ లోని ష్వాహ్ అనే బంగారు దుకాణంలో ఈ చోరీ జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో నగల దుకాణాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ రోజూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. బంగారు ప్రియులతో ఈ ప్రాంతం చాలా రద్దీగా కనిపిస్తోంది.

బుధవారం కూడా ఆ ప్రాంతం కస్టమర్లతో రద్దీగా ఉంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ దుకాణంలో ముగ్గురు దుండగులు చొరబడ్డారు. అనంతరం కత్తులతో బెదిరించి 25 తులాల బంగారాన్ని చోరీ చేశారు. ఈ క్రమంలో వారికి అడ్డు వచ్చిన షాపు యాజమాని కుమారుడు రెహ్మాన్ పై కత్తులతో దాడి చేశారు. బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడికి ప్రాణపాయస్థితి తప్పినప్పటికి మొత్తం 20 కుట్లు పడినట్లు సమాచారం. ఇక ఈ చోరీ ఘటన మొత్తం ఆ షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం..ఆ దుండగులు నార్త్ ఇండియన్స్ లాగా  ఉన్నారు. వారి భాషా నార్త్ ఇండియాలా ఉందని స్థానికులు చెప్పారు. మొత్తంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం పోలీసు  గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలే ఇలా దోపిడి జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి