iDreamPost

క్రికెట్‌ ఫీవర్‌.. ప్రధాన మంత్రుల మధ్య ప్లకార్డ్‌ వార్‌!

  • Published Jul 12, 2023 | 1:27 PMUpdated Jul 12, 2023 | 1:27 PM
  • Published Jul 12, 2023 | 1:27 PMUpdated Jul 12, 2023 | 1:27 PM
క్రికెట్‌ ఫీవర్‌.. ప్రధాన మంత్రుల మధ్య ప్లకార్డ్‌ వార్‌!

క్రికెట్‌ను ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఇష్టపడతారు. అలాగే కొన్ని దేశాల మధ్య మ్యాచ్‌ అంటే అది క్రికెట్‌ను మించి మినీ యుద్ధంలా ఉంటుంది. మనకు ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లు ఎలాగో.. ఇంగ్లీష్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్‌ సిరీస్‌ అలాగ. యాషెస్‌ సిరీస్‌కు పెద్ద చరిత్రే ఉంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఓడినా.. ఆయా దేశాల అభిమానలు అంతా ఫీలైపోరేమో కానీ, యాషెస్‌ సిరీస్‌లో తమ జట్టు ఓడితే మాత్రం.. ఆ దేశ క్రికెటర్లకు మూడినట్టే. గెలిస్తే ఎలా నెత్తిన పెట్టుకుంటారో.. ఓడితే అంతకు మించి ద్వేషిస్తారు. అందుకే యాషెస​ అనగానే రెండు దేశాల క్రికెటర్లు ఒళ్లుదగ్గరపెట్టకుని ఆడతారు.

ప్రపంచ క్రికెట్‌లో ఒక టెస్టు సిరీస్‌ ఆసక్తికరంగా, హోరాహోరీగా సాగుతుంది అంటే.. అది కచ్చితంగా యాషెస్‌ సిరీసే. ఇటు ఆస్ట్రేలియా, అటు ఇంగ్లండ్‌ రెండు దేశాల ఆటగాళ్లు ప్రాణాలు పెట్టి ఆడుతుంటారు. అందుకే ఈ సిరీస్‌ ఎంతో టఫ్‌గా నడుస్తుంది. వాటికి తోడు ఆటగాళ్ల మధ్య వివాదాలు, గొడవలు, స్లెడ్జింగ్‌ వస్తూనే ఉంటాయి. అవే ఆటలో హీట్‌ను, మ్యాచ్‌పై ఇంట్రెస్ట్‌ను కలిగిస్తాయి. ప్రస్తుతం యాషస్‌ సిరీస్‌ నడుస్తోంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు టెస్టులు ముగిశాయి.

యాషెస్‌ కంటే ముందు టీమిండియాతో జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి.. టెస్ట్‌ క్రికెట్‌కు రారాజుగా అవతరించింది. ఆ వెంటనే యాషెస్‌ సిరీస్‌ మొదలు కావడంతో అదే జోష్‌లో తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. కానీ, రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో అవుట్‌పై వివాదం రాజుకుంది. ఇది ఏ స్థాయికి చేరిందంటే బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్‌, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌ పోటాపోటీ ట్వీట్లు చేసుకునే వరకూ వెళ్లింది.

అయితే.. ఆ ఇద్దరు ప్రధానులు తాజాగా ఒకే వేదికపైకి వచ్చారు. రెండు దేశాల భేటీలో పలు కీలక అంశాలపై చర్చించుకున్న తర్వాత.. భేటీ ముగింపులో ఆస్ట్రేలియా ప్రధాని యాషెస్‌ సిరీస్‌లో తాము 2-1తో ముందంజలో ఉన్నామనే ప్లకార్డును ప్రదర్శించారు. ఆ వెంటనే రిషి సునక్‌ మూడో టెస్టులో ఇంగ్లండ్‌ అద్భుత విజయం సాధించిదనే ప్లకార్డును ప్రదర్శించారు. ఇలా రెండు దేశాల ప్రధాన మంత్రులు క్రికెట్‌ను ఇంత సీరియస్‌గా తీసుకుని, ఒకే వేదికపై పోటాపోటీ ప్లకార్డులు ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ధోని కావాలనే రనౌట్‌ అయ్యాడు: యువరాజ్‌ తండ్రి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి