iDreamPost

వీడియో: కెమెరామెన్‌ను గాయపర్చిన పంత్‌! మ్యాచ్‌ తర్వాత క్షమాపణలు..

  • Published Apr 25, 2024 | 8:25 AMUpdated Apr 25, 2024 | 8:32 AM

Rishabh Pant, DC vs GT, IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ చేసిన పనికి ఓ కెమెరామెన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో ఉన్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant, DC vs GT, IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ చేసిన పనికి ఓ కెమెరామెన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో ఉన్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 25, 2024 | 8:25 AMUpdated Apr 25, 2024 | 8:32 AM
వీడియో: కెమెరామెన్‌ను గాయపర్చిన పంత్‌! మ్యాచ్‌ తర్వాత క్షమాపణలు..

ఐపీఎల్‌ 2024లో భాగంగా బుధవారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ క్రికెట్‌ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 224 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేజింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ను 220 పరుగులకు కట్టడి చేసి.. 4 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తోనే ఢిల్లీకి అంత భారీ స్కోర్‌ వచ్చింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ చేసిన పనికి దేవషీష్‌ అనే కెమెరామెన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మ్యాచ్‌ తర్వాత.. పంత్‌ అతనికి సారీ కూడా చెప్పాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ మ్యాచ్‌లో డీసీ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కానీ, ఆ జట్టుకు మంచి స్టార్ట్‌ లభించలేదు. 35 పరుగుల వద్ద జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తొలి వికెట్‌గా వెనుదిరగాడు. ఆ వెంటనే డీసీ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ వెంటనే మరో ఓపెనర్‌ పృథ్వీ షా 11 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. దీంతో 36 పరుగులకే డీసీ 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరికొద్ది సేపటికే 44 పరుగుల వద్ద షైహోప్‌ కూడా అవుట్‌ అయ్యాడు. డీసీ తీవ్ర కష్టాల్లో పడింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ పొంది వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్‌, కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అద్భుతమైన భాగస్వామ్యంతో డీసీకి భారీ స్కోర్‌ అందించారు. అక్షర్‌ పటేల్‌ 43 బంతుల్లో 66, రిషభ్‌ పంత్‌ 43 బంతుల్లో 88 పరుగులు చేసి అదరగొట్టారు. పంత్‌ ఇన్నింగ్స్‌ 5 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. అయితే.. ఈ 8 సిక్సులలో ఒక సిక్స్‌ మాత్రం.. ఆ కెమెరామెన్‌ గాయానికి కారణమైంది.

పంత్‌ కొట్టిన ఆ భారీ సిక్సర్‌.. నేరుగా వెళ్లి దేవషీష్‌ అనే కెమెరామెన్‌కు తాకడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా, మ్యాచ్‌ తర్వాత విషయం తెలుసుకున్న రిషభ్‌ పంత్‌.. కోచ్‌ రికీ పాంటింగ్‌తో కలిసి.. ఆ కెమెరామెన్‌కు సారీ చెప్పాడు. మిమ్మల్ని కొట్టాలని తాను అనుకోలేదని, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పంత్‌ పేర్కొన్నాడు. అయితే.. క్రికెట్‌లో ఇలా సిక్సుల కారణంగా కెమెరా మెన్లు, ప్రేక్షకులు అప్పుడప్పుడు గాయపడుతుండటం సహజమే అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. కానీ, గాయం తీవ్రత ఎక్కువగా లేకుండా బాగుంటుందని, గాయపడిన ఆ కెమెరామెన్‌ త్వరగా కోలుకోవాలని పంత్‌ అభిమానులు సైతం సోషల్‌ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. మరి గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ ఇన్నింగ్స్‌తో పాటు, కెమెరామెన్‌ గాయపడటం, అతనికి పంత్‌ సారీ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి