iDreamPost

Rinku Singh: BCCI కొత్త రూల్.. రింకూ సింగ్ కు అన్యాయం!

బీసీసీఐ తాజాగా తీసుకొచ్చిన కొత్త రూల్ కారణంగా రింకూ సింగ్ కు తీవ్ర అన్యాయం జరగనుంది. మరి బీసీసీఐ తెచ్చిన ఆ కొత్త రూల్ ఏంటి? రింకూకు అది ఏ విధంగా మైనస్ కానుంది?

బీసీసీఐ తాజాగా తీసుకొచ్చిన కొత్త రూల్ కారణంగా రింకూ సింగ్ కు తీవ్ర అన్యాయం జరగనుంది. మరి బీసీసీఐ తెచ్చిన ఆ కొత్త రూల్ ఏంటి? రింకూకు అది ఏ విధంగా మైనస్ కానుంది?

Rinku Singh: BCCI కొత్త రూల్.. రింకూ సింగ్ కు అన్యాయం!

రింకూ సింగ్.. ప్రస్తుతం టీమిండియాలో మారుమ్రోగుతున్న పేరు. ఐపీఎల్ 2023 సీజన్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ యువ ఆటగాడు. ఈ మెగాటోర్నీలో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు రింకూ. ఇక 2023 ఐపీఎల్ సీజన్ లో అద్భుత ప్రదర్శన కనబర్చి టీమిండియాలోకి దూసుకొచ్చాడు ఈ యువ కెరటం. తొలుత టీ20ల్లో, ఆ తర్వాత వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు రింకూ. ఇక్కడ కూడా అదే స్థాయిలో రాణిస్తూ.. దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో 38 పరుగులు చేసి రాణించాడు. కాగా.. బీసీసీఐ తాజాగా తీసుకొచ్చిన కొత్త రూల్ కారణంగా రింకూ సింగ్ కు తీవ్ర అన్యాయం జరగనుంది. మరి బీసీసీఐ తెచ్చిన ఆ కొత్త రూల్ ఏంటి? రింకూకు అది ఏ విధంగా మైనస్ కానుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

2023లో ఐర్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు రింకూ సింగ్. ఇక తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేతో వన్డేల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు ఈ చిచ్చర పిడుగు. ఇప్పటి వరకు 12 ఇంటర్నేషనల్ టీ20లతో పాటుగా రెండు వన్డేలు ఆడాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. తాజాగా బీసీసీఐ తీసుకొస్తున్న కొత్త రూల్ తో రింకూ సింగ్ కు అన్యాయం జరగబోతోంది. అసలు విషయం ఏంటంటే? BCCI తీసుకొస్తున్న కొత్త రూల్ ప్రకారం ఎవరైనా అన్ క్యాప్డ్ ప్లేయర్ రెండు ఐపీఎల్ సీజన్ల మధ్యలో టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ ఆడినా.. అతడి శాలరీ రెండో సీజన్ ఐపీఎల్లో పెరుగుతుంది. ప్రస్తుతం రజత్ పాటిదార్ కు ఈ రూలే వర్తించి.. రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షలకు అతడి శాలరీ పెరిగింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే ద్వారా అతడు వన్డేల్లో అరంగేట్రం చేశాడు.

బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం అన్ క్యాప్డ్ ప్లేయర్లు భారత్ తరఫున ఒక్క మ్యాచ్ ఆడినా వారి వేతనం రూ.50 లక్షలు అవుతుంది. ఇక 5 నుంచి 9 మ్యాచ్ లు ఆడితే 75 లక్షలు, 10 మ్యాచ్ లు ఆడితే కోటి రూపాయాలు అవుతుంది. అయితే ఈ చొప్పున ఇప్పటికే రింకూ జీతం 2024లో కోటి రూపాయాలు కావాలి. కానీ కాలేదు. ఎందుకంటే? ఈ కొత్త రూల్ ప్రకారం అన్ క్యాప్డ్ ప్లేయర్ కనీస వేతనం రూ. 50 లక్షలు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. కాగా.. రింకూ సింగ్ ఐపీఎల్ శాలరీ రూ. 55 లక్షలుగా ఉంది. ఇదే ఇప్పుడు అతడికి మైనస్ గా మారింది. దీంతో కోటి రూపాయాలు కావాల్సిన అతడి జీతం అలాగే ఉండనుంది.

ఒకవేళ బీసీసీఐ ఈ నిబంధనల్లో మార్పులు చేస్తే.. రింకూ శాలరీ పెరుగుతుంది. ఇదిలా ఉండగా రింకూ బ్యాట్ కు బలైన బౌలర్ యశ్ దయాల్ కు మాత్రం ఐపీఎల్ లో కోట్లు కుమ్మరించింది ఆర్సీబీ. యశ్ దయాల్ ను రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది. రింకూని కోల్ కత్తా రిటైన్ చేసుకోవడంత అతడి ఐపీఎల్ జీతం రూ. 55 లక్ష్ల దగ్గరే ఆగిపోయింది. రింకూ శాలరీ 5 లక్షలు తక్కువగా ఉంటే.. ఇప్పుడతడు కోటీశ్వరుడు అయ్యేవాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి రింకూకు జరిగిన అన్యాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి