iDreamPost
android-app
ios-app

తెలంగాణలో రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ మార్క్!

New Ration Cards: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా రేషన్ కార్డుల విషయంలో రేవంత్ సర్కార్ మార్క్ చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

New Ration Cards: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా రేషన్ కార్డుల విషయంలో రేవంత్ సర్కార్ మార్క్ చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణలో రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ మార్క్!

గత ఏడాది తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల జరిగాయి.   బీఆర్ఎస్ పాలనకు చెక్ పెడుతూ.. కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు తెలంగాణ ప్రజలు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకు వచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలపై నమ్మకం ఉంచి గెలిపించారు. సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణం చేసిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు. అంతేకాదు పథకాల అమలుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుంది. ఇందులో భాగంగానే రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ తమదైన మార్క్ చాటుకోవడానికి ప్రయత్నిస్తుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో రేవంత్ సర్కార్ గత ప్రభుత్వ పాలన ప్రభావం తగ్గించడానికి తమదైన మార్క్ చాటుకోవడానికి పక్కా పథకం ప్రకారం ముందుకు సాగుతుంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత  ప్రయాణ సౌకర్యం, రూ.500 లకే సబ్సిడీ గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల బీమా సౌకర్యం లాంటివి మొదలు పెట్టారు. అంతేకాదు ఎన్నికల సమయంలో అర్హులైన ప్రతిఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంటం వల్ల ఆ కార్యక్రమం ఆలస్యమవుతుంది.. పూర్తయ్యాక ప్రక్రియ మొదలు పెడతామని మంత్రులు తెలిపారు. ఈ క్రమంలోనే.. ఇటీవల ‘ప్రజాపాలన’ ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు లక్షల్లో వచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ చాటుకునేలా కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వారికి రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాదు.. పాత కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే పాత రేషన్ కార్డుల రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులు, వారి వివరాలు ఉండేవి.కొత్త రేషన్ కార్డుల్లో పలు మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. అభయ హస్తంలో భాగంగా ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల దరఖాస్తులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై అధికారులు స్క్రూటీనీ కూడా పూర్తి చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి