iDreamPost

LRS దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. అప్పటి వరకు ఛాన్స్‌..!

  • Published Feb 27, 2024 | 10:41 AMUpdated Feb 27, 2024 | 10:41 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి కోరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి కోరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Feb 27, 2024 | 10:41 AMUpdated Feb 27, 2024 | 10:41 AM
LRS దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. అప్పటి వరకు ఛాన్స్‌..!

ఎల్ఆర్ఎస్ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ 2020) దరఖాస్తులకు సంబంధించి రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఎల్ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లేఔట్‌ క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్-2020 తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు సుమారు 25 లక్షల మంది దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఈ చట్టంపై న్యాయస్థానాల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో ఇది దరఖాస్తులకే పరిమితమైంది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. మరోసారి ఆ చట్టాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. దరఖాస్తుదారులు మరో అవకాశ ఇవ్వనుంది. క్రమబద్ధీకరణ చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. ఆ వివరాలు..

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 31 వరకు దరఖాస్తుదారులకు లేఅవుట్‌లు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే.. దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప.. ఇతర లేఅవుట్‌లను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల సుమారు 20 లక్షల మంది దిగువ, మధ్య తరగతి వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ అంటే ఏంటీ..

అనుమతి లేని లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందే ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ 2020). ప్రభుత్వ విధివిధానాలు పాటించకుండా చేసిన లేఔట్లు, అక్రమ స్థలాల్లో నిర్మించిన లేఔట్లను అనుమతి దక్కని లేఔట్లుగా పరిగణిస్తారు. అయితే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇలాంటి స్థలాలను కచ్చితంగా రెగ్యులరైజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ పేరుతో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

వాస్తవంగా చూసుకుంటే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారిక లేఔట్‌ విషయానికి వస్తే.. మొత్తం భూమిలో పది శాతం స్థలాన్ని ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది. కాగా.. అనధికారిక లేఔట్లలో ఇలా స్థలాన్ని వదిలేయకుండా నిర్మాణాలు చేపడుతుంటారు. దీనివల్ల జనావాసాల్లో సౌకర్యాలు సరిగ్గా ఉండక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలా సర్కార్ రూల్స్ పాటించని లేఅవుట్‌లలోని ఇళ్ల స్థలాల నుంచి 0.14 శాతం ఓపెన్‌ ల్యాండ్‌ ఛార్జీలను వసూలు చేస్తారు.

ఆ డబ్బుతో కొంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి.. అనధికార లేఅవుట్‌లోని కాలనీకి కేటాయించాలన్నది ఈ ఎల్ఆర్ఎస్ ప్రధాన ఉద్దేశం అన్నమాట. కానీ దీని మీద గతంలో అనేక ఫిర్యాదులు రావడం.. సమస్య కోర్టుకు చేరడంతో.. అది పెండింగ్‌లోనే ఉంది. ఇక తాజాగా రేవంత్‌ సర్కార్‌ మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అనధికారిక అంచనాల ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌కు అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది అంటున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి