iDreamPost

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ CMగా రేవంత్ రెడ్డి

అందరు ఊహించినట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో రెండు రోజుల ఉత్కంఠతకు తెరపడింది.

అందరు ఊహించినట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో రెండు రోజుల ఉత్కంఠతకు తెరపడింది.

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ CMగా రేవంత్ రెడ్డి

అందరు ఊహించినట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో రెండు రోజుల ఉత్కంఠతకు తెరపడింది. రేవంత్ ను సీఎం గా ప్రకటించడంతో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఎల్లుండి (డిసెంబర్ 07) రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం మొదటిసారి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. హస్తం పార్టీ నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 64 స్థానాలను కైవసం చేసుకుంది హస్తం పార్టీ. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సీట్లను గెలుచుకుని నూతన గవర్నమెంట్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చ జోరందుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించాలని ముక్త కంఠంతో నినదించారు. మరోవైపు పార్టీ సీనియర్ లీడర్లు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు కూడా తాము సీఎం రేసులో ఉన్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ ను సీఎంగా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీఎం పంచాయితీ ఢిల్లీ పెద్దలకు చేరింది. సుధీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం ఎనుముల రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని ప్రకటించారు. వెంటిలేటర్ పై ఉన్న హస్తం పార్టీకి ఊపిరులూది నేడు అధికారంలోకి తీసుకు వచ్చిన రేవంత్ కు సీఎం పదవి దక్కడంతో ఆయన అభిమానులు, కార్యకర్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి