iDreamPost

TSRTC షాక్.. మేడారం స్పెషల్ బస్సుల్లో మహిళలకూ చార్జీలు?

  • Published Jan 04, 2024 | 10:37 AMUpdated Jan 04, 2024 | 10:37 AM

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉచిత ప్రయాణాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మేడారం జాతర సందర్భంగా టికెట్లు తీసుకోవాలని భావిస్తోందట ఆర్టీసీ యాజమాన్యం. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉచిత ప్రయాణాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మేడారం జాతర సందర్భంగా టికెట్లు తీసుకోవాలని భావిస్తోందట ఆర్టీసీ యాజమాన్యం. ఆ వివరాలు..

  • Published Jan 04, 2024 | 10:37 AMUpdated Jan 04, 2024 | 10:37 AM
TSRTC షాక్.. మేడారం స్పెషల్ బస్సుల్లో మహిళలకూ చార్జీలు?

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలి రోజు నుంచే ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీని కింద రాష్ట్రంలోని మహిళలందరకి బస్సుల్లో ఉచిత ప్రయణానికి అవకాశం కల్పించారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఉచిత పథకం ప్రారంభించిన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరుగుతోందని ఆర్టీసీ గణాంకాలు వెల్లడించాయి. ఉచిత ప్రయాణం కారణంగా బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. దీని వల్ల పురుషులు, కాలేజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం ప్రత్యేక బస్సులు కేటాయించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

సాధారణ రోజుల్లోనే బస్సుల్లో రద్దీ ఇంతలా ఉంటే.. ఇక త్వరలోనే రాబోయే సంక్రాంతి పండుగ, మేడారం జాతర సమయంలో ఎంత రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈక్రమంలో మేడారం జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ ఇవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మేడారం స్పెషల్ బస్సుల్లో మహిళలకు టికెట్లు జారీ చేయనున్నారనే వార్తలు వినిపస్తున్నాయి. ఆ వివరాలు..

Charges for women in Medaram special buses!

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కోసం ఆర్టీసీకి నెలకు సుమారు రూ. 250 కోట్లు చెల్లించానున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడనుంది. ఇక త్వరలోనే సంక్రాంతి,  మేడారం జాతరలు రానున్నాయి. పండుగ సంగతి పక్కకు పెడితే.. మేడారం జాతరకు జనాలు పోటెత్తుతారు. రాష్ట్రం నుంచి చాలా మంది ఈ జాతరకు తరలివెళ్తారు. ఈ క్రమంలో మేడారం జాతర సమయంలో కూడా అప్పుడు కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తే ఖజానాపై మరింత భారం పడనుందని రేవంత్ సర్కార్ భావిస్తోందట.

అందుకే ఈ మేడారం జాతరకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో స్పెషల్ బస్సులను నడపాలని రేవంత్ రెడ్డి సర్కారు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇప్పుడు మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలోనే ఉచిత ప్రయాణ సదుపాయాం ఉన్నది. కానీ, స్పెషల్ బస్సులకు టికెట్లు అనేది ఎప్పటి నుంచో అమల్లో ఉన్నదే. అందుకే మేడారం జాతరకు స్పెషల్ బస్సులను నడిపితే.. వాటిల్లో ఎక్కే మహిళలు తప్పకుండా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించి స్పెషల్ బస్సులను పూర్తిస్థాయిలో నడపాలని.. ఇప్పటికే రేవంత్.. ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఈ విషయంపై ఇప్పటికే ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి మాట్లాడినట్టు సమాచారం. స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేనందున వాటినే పూర్తిస్థాయిలో మేడారం జాతరకు వినియోగించాలని ఆదేశించినట్టు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి