iDreamPost

కొన్ని గంటల్లో లక్ష కోట్ల సంపాదన! ఇదీ అంబానీ రేంజ్!

బిజినెస్ రంగంలో తనకు తానే సాటిగా నిలుస్తున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు. ఏకంగా కొన్ని గంటల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి లక్షకోట్లు సంపాదన వచ్చింది.

బిజినెస్ రంగంలో తనకు తానే సాటిగా నిలుస్తున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు. ఏకంగా కొన్ని గంటల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి లక్షకోట్లు సంపాదన వచ్చింది.

కొన్ని గంటల్లో లక్ష కోట్ల సంపాదన! ఇదీ అంబానీ రేంజ్!

వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ పరిచయం అక్కర్లేని పేరు. అపర కుబేరుడిగా పేరుగాంచిన ముఖేష్ అంబానీ బిజినెస్ రంగంలో తనకు తానే సాటిగా నిలుస్తున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు. ఏకంగా కొన్ని గంటల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి లక్షకోట్లు సంపాదన వచ్చింది. ఇది రెండు రోజుల క్రితం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర బడ్జెట్ కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాల్లో కొనసాగడం ముఖేష్ అంబానికి కలిసొచ్చింది. సోమవారం నాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు మార్కెట్ల ర్యాలీలో పాల్గొన్నాయి.

ఈ క్రమంలో ఇంట్రాడేలో రిలయన్స్ స్టాక్ గరిష్ఠంగా 7 శాతానికి పైగా లాభపడింది. దీంతో రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ సరికొత్త గరిష్ఠమైన రూ.19.5 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఒక్కరోజులోనే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.లక్ష కోట్ల మేర పెరిగింది. రిలయన్స్ షేర్లు పెట్టుబడిదారులకు అధిక లాభాలను అందిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర సోమవారం రికార్డు స్థాయికి చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా రూ.19.50 లక్షల కోట్లు దాటింది. రిలయన్స్ షేర్లు బిఎస్‌ఇలో దాదాపు 7 శాతం పెరుగుదలతో రూ. 2897.40 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

Earning a lakh crore in a few hours! This is the Ambani range!

బిఎస్‌ఇలో రిలయన్స్ షేరు ధర 6.90 శాతం ఎగబాకి 2897.40 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ పెరుగుదల కారణంగా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ 285 నిమిషాల్లో రూ. 1.25 లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 5 గంటల్లో రూ.1.25 లక్షల కోట్లు ఆర్జించింది. డేటా ప్రకారం, కంపెనీ షేర్లు సోమవారం మధ్యాహ్నం 2:15 గంటలకు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.19,59,370.53 కోట్లకు చేరుకుంది. కాగా గత వారం చివరి ట్రేడింగ్ రోజున కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.18,33,737.6 కోట్లుగా ఉంది. అంటే ఈ కాలంలో కంపెనీ రూ.125632.93 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఎంతో మంది వ్యాపార దిగ్గజాలకు సాధ్యపడని రీతిలో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ను లాభాల బాట పట్టిస్తున్నారు. కొన్ని గంటల్లోనే లక్ష కోట్లు ఆర్జించడమంటే మామూలు విషయం కాదు. ఇది తెలిసిన వారు అంబానీ రేంజ్ అంటే అలా ఉంటుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ కొన్ని గంటల్లోనే లక్ష కోట్ల సంపాదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి