iDreamPost

Relianceలో ఉద్యోగాలు.. యువ టెకీల కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్

ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ను మొదటిసారి ప్రారంభించినట్లు ఆర్ఐఎల్ తెలిపింది.

ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ను మొదటిసారి ప్రారంభించినట్లు ఆర్ఐఎల్ తెలిపింది.

Relianceలో ఉద్యోగాలు.. యువ టెకీల కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్

వ్యాపార రంగంలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న భారతదేశపు అతిపెద్ద వ్యాపార కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలోని యువ టెకీలకు గుడ్ న్యూస్ అందించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లో పలు విభాగాల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను నియమించుకునేందుకు గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ ట్రైనీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పెట్రో కెమికల్ నుంచి న్యూ ఎనర్జీ వరకు రిలయన్స్‌కు చెందిన వివిధ వ్యాపార విభాగాల్లో ఉద్యోగావకాశాలను కల్పించనుంది. దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ను మొదటిసారి ప్రారంభించినట్లు ఆర్ఐఎల్ తెలిపింది.

దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు రిలయన్స్ ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను చేపట్టినట్లు వెల్లడించింది. గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ (GET) 2024 పేరిట ప్రారంభించిన ఈ డ్రైవ్‌లో భాగంగా జనవరి 11 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీటెక్‌, బీఈ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. ఏఐసీటీఈ ఆమోదం పొందిన విద్యా సంస్థల నుంచి కెమికల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఇన్‌స్ర్టుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక షార్ట్‌లిస్ట్‌ చేసిన స్టూడెంట్స్ కు ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఆన్‌ లైన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

అందులో ఎంపికైన వారిని ఫిబ్రవరి 23 నుంచి మార్చి 11 వరకు పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. మార్చి నెలాఖరుకు ఈ ఎంపిక ప్రక్రియ ముగుస్తుంది. అభ్యర్థులు 10, 12, డిప్లొమాలో 60 శాతం మార్కులు లేదా 6 CGPA సాధించి ఉండాలి. ఇంజినీరింగ్‌లో 60 శాతం (ఏడో సెమిస్టర్‌/ గ్రాడ్యుయేషన్‌) మార్కులు సాధించిన వారు అర్హులు. ఈ ప్రోగ్రాంలో ఎంపికైన అభ్య‌ర్ధుల‌ను మ్యాన్యుఫ్యాక్చ‌రింగ్‌, ఎక్ల్సోరేష‌న్, ప్రొడ‌క్ష‌న్‌, రిల‌య‌న్స్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌, పెట్రోకెమిక‌ల్స్‌, ప్రొక్యూర్‌మెంట్, కాంట్రాక్టింగ్‌, రిల‌య‌న్స్ న్యూ ఎన‌ర్జీ స‌హా ప‌లు విభాగాల్లో నియమించుకుంటుంది. పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్ ను https://relianceget2024.in/ పరిశీలించొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి