iDreamPost

Prabhas: సొంత ఊరి కోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభాస్? రియల్ శ్రీమంతుడు!

  • Published Mar 23, 2024 | 7:42 PMUpdated Mar 23, 2024 | 7:42 PM

పాన్ ఇండియా రెబెల్ హీరో ప్రభాస్ తెర పైన కనిపిస్తూ ఎంత పేరు సంపాదించుకున్నాడో.. తెర వెనుక కూడా అంతే మంచి పనులు చేస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు. తాజాగా ప్రభాస్ తీసుకున్న ఓ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాన్ ఇండియా రెబెల్ హీరో ప్రభాస్ తెర పైన కనిపిస్తూ ఎంత పేరు సంపాదించుకున్నాడో.. తెర వెనుక కూడా అంతే మంచి పనులు చేస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు. తాజాగా ప్రభాస్ తీసుకున్న ఓ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Mar 23, 2024 | 7:42 PMUpdated Mar 23, 2024 | 7:42 PM
Prabhas: సొంత ఊరి కోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభాస్? రియల్ శ్రీమంతుడు!

హీరో అనే పదానికి తెరమీదే కాకుండా తెర వెనుక కూడా న్యాయం చేస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ సినిమాలలో అయితే ఏ క్యారెక్టర్ కు అయినా న్యాయం చేస్తాడు. కానీ, రియల్ లైఫ్ లో మాత్రం చాలా అరుదుగా అందరికి కనిపిస్తూ ఉంటాడు. అన్ని కోట్ల ఆస్తి, అంత గొప్ప పేరు, మర్యాదలు ఇన్ని ఉన్నా కూడా ..ప్రభాస్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటూ ఉంటాడు. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి లేదు అనకుండా .. సాయం చేస్తాడు. ఇంకా సెట్స్ లో ప్రభాస్ తెప్పించే ఫుడ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలలో చేసే ఏ ఆర్టిస్ట్ ను అడిగినా ప్రభాస్ చేసే .. అతిధి మర్యాదలు గురించి నాన్ స్టాప్ గా చెబుతూ ఉంటారు. అయితే, తాజాగా ప్రభాస్ తీసుకున్న ఓ నిర్ణయం.. అందరికి ప్రభాస్ పై .. మరింత గౌరవం పెంచేలా చేస్తుంది. తానూ ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన కూడా తన మూలాలను మరిచిపోలేదు ప్రభాస్.

ప్రభాస్ సొంత ఊరు గురించి అందరికి తెలుసు. ప్రభాస్ సొంత ఊరు మొగల్తూరు. ప్రభాస్ సినిమాల రిలీజ్ ల సమయంలో.. మొగల్తూరులో అభిమానులు చేసే హడావిడి అంత ఇంత కాదు. అయితే, తాజాగా ప్రభాస్ ఆ ఊరి బాగోగుల కోసం ఓ నిర్ణయాన్ని తీసుకున్నాడు. మొగల్తూరులో రోడ్స్ వేయించడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనితో ఏకంగా ప్రభాస్ ఏ దిగి వచ్చి.. తన సొంత ఊరిలో ఖచ్చితంగా రోడ్స్ వేయించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఏకంగా ప్రభాస్ సుమారు 200 కోట్లను ఖర్చుపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే మొగల్తూరులో ఈ పనులు ప్రారంభం అయినట్లు సమాచారం. ఇంత గొప్ప స్థాయికి ఎదిగినా కూడా .. ప్రభాస్ తన సొంత ఊరిని గుర్తుపెట్టుకున్నందుకు.. అందరు ప్రభాస్ ను ఎంతో అభిమానిస్తున్నారు. ఇక ప్రభాస్ అభిమానులైతే
అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. సలార్ సినిమాతో ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఆ సినిమా గురించి ఎక్కడో ఓ దగ్గర వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సలార్ పార్ట్ -1 కు కంటిన్యూషన్ గా పార్ట్ -2 కూడా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ మూవీస్ అన్నీ కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతాయి. ఇక ఇప్పుడు అభిమానులందరి ఆశలు.. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న “కల్కి” సినిమా మీదే ఉన్నాయి. ఇప్పటికే ఒక్కొక్కటిగా ఈ సినిమా గురించి వస్తున్న అప్ డేట్స్ తో.. ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, ప్రభాస్ తన సొంత ఊరి కోసం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి