iDreamPost

‘సలార్’ వెయ్యి కోట్లు మిస్ అవ్వడానికి మూడు కారణాలు..!

సలార్‌ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా భారీ అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. ఆ అంచనాలను సినిమా అందుకుంది అనుకోవాలి. కానీ సినిమా వసూళ్ల విషయంలో మాత్రం ఫ్యాన్స్‌ కొందరు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి కోట్లు రాకపోవడం తో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సలార్‌ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా భారీ అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. ఆ అంచనాలను సినిమా అందుకుంది అనుకోవాలి. కానీ సినిమా వసూళ్ల విషయంలో మాత్రం ఫ్యాన్స్‌ కొందరు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి కోట్లు రాకపోవడం తో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘సలార్’ వెయ్యి కోట్లు మిస్ అవ్వడానికి మూడు కారణాలు..!

తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల సినీ ప్రేక్షకులు మరియు మీడియా వర్గాల వారు దాదాపు రెండేళ్లుగా ఎదురు చూసిన ‘సలార్‌’ సినిమా విడుదల అయ్యింది. క్రిస్మస్ కానుకగా విడుదల అయిన సలార్‌ సినిమా కొత్త సంవత్సరం లో కూడా సందడి చేస్తోంది. జనవరి 1వ తారీకున సలార్‌ టీం అధికారిక ఎక్స్ ఖాతాలో రూ.625 కోట్ల వసూళ్లు నమోదు చేసింది అంటూ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ నెంబర్‌ చిన్న నెంబర్‌ ఏమీ కాదు.. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ లో కాస్త అసంతృప్తి కనిపిస్తుంది. కేజీఎఫ్ 2 సినిమా మాదిరిగా ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందని బలంగా నమ్మిన వారు సలార్‌ ఆ నెంబర్‌ చేరదేమో అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. నిజమే సలార్‌ వెయ్యి కోట్ల మార్క్ ను అందుకోవడం దాదాపు అసాధ్యం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

రెండు వారాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇంకా రూ.375 కోట్ల వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఈ సినిమా కు పోటీ గా ఆయా భాషల్లో సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఇప్పటికే కొన్ని భాషల్లో సలార్‌ సినిమా వసూళ్లు పూర్తిగా డ్రాప్ అయ్యాయి. సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్నాయి కనుక తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ వారం వరకు సలార్‌ సందడి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సలార్‌ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. సలార్‌ సినిమా వెయ్యి కోట్ల టార్గెట్‌ రీచ్ అవ్వక పోవడంకు మూడు కారణాలు ఉన్నాయి అంటూ సోషల్‌ మీడియాలో కొందరు చర్చించుకుంటున్నారు.

Salaar

ఆ కారణాల విషయానికి వస్తే… సలార్‌ కి బాలీవుడ్‌ లో సాలిడ్‌ ఓపెనింగ్స్ దక్కలేదు. అందుకు కారణం ఏంటో అందరికీ తెలిసిందే. ఔను షారుఖ్ ఖాన్‌ హీరోగా నటించిన డంకీ సినిమా ఉండటమే. సలార్‌ కి డంకీ అక్కడ గట్టి పోటిని ఇచ్చింది. అందుకే ఆశించిన స్థాయిలో అక్కడ వసూళ్లు నమోదు అవ్వలేదు. ఇక సలార్‌ కన్నడంలో ఒక మోస్తరు వసూళ్లు కూడా దక్కించుకోలేదు. అక్కడ సినిమాకి తీవ్ర నిరాశ ఎదురైంది. దాంతో ఓవరాల్‌ కలెక్షన్స్ పై కన్నడ కలెక్షన్స్ ప్రభావం తీవ్రంగా పడింది. ఇక మూడవ కారణం.. సలార్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చలేదు. యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రమే అన్నట్లుగా సలార్‌ పబ్లిక్‌ లోకి టాక్ వెళ్లింది. అందుకే ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల కు కాస్త దూరంలో నిలిచింది. మరి రెండో పార్ట్ తో అయినా సలార్ వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందా అనేది చూడాలి. సలార్ వెయ్యి కోట్లు వసూళ్లు నమోదు చేయక పోవడంకు మీరు ఇంకేదైనా కారణం అనుకుంటున్నారా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి