iDreamPost

లారీలను రైళ్ళల్లో ఎందుకు తరలిస్తున్నారో తెలుసా ?

లారీలను రైళ్ళల్లో ఎందుకు తరలిస్తున్నారో  తెలుసా ?

కరోనా వైరస్ సమస్యలు పెరిగిపోతున్న నేపధ్యంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవాసర వస్తువుల రవాణాకు కొత్త పంథాలో వెళుతున్నాయి. మామూలుగా అయితే ఇప్పటి వరకూ కొన్ని వస్తువులను, కొంత పరిణామంలో మాత్రమే ఒకచోట నుండి ఇతర ప్రాంతాలకు రైళ్ళల్లో పంపుతారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ సమస్య తీవ్రత కారణంగా మ్యాగ్జిమమ్ అన్నీ వస్తువులను రైళ్ళల్లోనే పంపేస్తున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మామూలుగా బియ్యం, పంచదార, పప్పులు, ఉప్పులు, పాలు, నూనెలు తదితరాలను లారీల్లో తెప్పించి రైళ్ళల్లో లోడ్ చేయించి తీసుకెళ్ళేవారు. కానీ ఇపుడు రూటుకాస్త మార్చి ఏకంగా లారీలకు లారీలనే గూడ్సు రైళ్ళల్లోకి ఎక్కించేసి అన్ లోడ్ చేయాల్సిన ప్రాంతాలకు తీసుకెళ్ళటం మాత్రం విచిత్రంగానే ఉంది. ఇందుకోసం ఉన్నతాధికారులు ప్రత్యేకించి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక అనుమతులు తీసుకున్నట్లు సమాచారం.

ఇంతకీ లారీలకు లారీలనే ఎందుకు గూడ్సు రైళ్ళలోకి ఎక్కించి తీసుకెళుతున్నారంటే ముందు జాగ్రత్త+లోడింగ్ అన్ లోడింగ్ కు అవకాశాలు తక్కువన్న కారణంతోనే అని తెలిసింది. ముందు జాగ్రత్త ఏమిటంటే దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న విషయం తెలిసిందే. మామూలుగా రోడ్డు మార్గంలో లారీల్లో నిత్యావసరాలను పంపాలంటే చాలా రోజులు పడుతుంది. పైగా ప్రస్తుత పరిస్ధితుల్లో అది రిస్కు కూడా.

ఏ బియ్యమో లేదా పప్పులు, నూనె, పంచదార లాంటి నిత్యావసరాలను తీసుకెళుతున్న లారీలను మధ్యలోనే ఎక్కడైనా ఎవరైనా హైజాక్ చేసే ప్రమాదం ఉందని రాష్ట్రప్రభుత్వాలు కేంద్రంతో చెప్పాయట. లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల సరఫరా కూడా సరిగా జరగటం లేదు. అందుకనే లారీలకు లారీలే మాయమైపోతే చేసేది కూడా ఏమీ లేదు. అందుకనే రైళ్ళలోకి లారీలను ఎక్కించేసి అవసరమైన సెక్యురిటిని పెట్టి పంపుతున్నారు. ఏపిలోని కడప, కర్నూలు, గుంతకల్, అనంతపురం, విశాఖపట్నం, రేణిగుంట నుండి ఎక్కువగా వెళుతున్నాయి. తెలంగాణాలోని మహబూబ్ నగర్, వరంగల్ , సికింద్రాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాల నుండి ఉత్తరాధికి వెళ్ళి వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి