iDreamPost

Uppal: ఉప్పల్‌లో రియల్‌ ఎస్టేట్‌ మోసం! కోట్ల రూపాయలతో ఉడాయించిన దంపతులు

  • Published Mar 19, 2024 | 12:17 PMUpdated Mar 19, 2024 | 12:18 PM

హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు మోసం చేసే కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. తాజాగా ఉప్పల్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అమాయకులను మోసం చేశారు.

హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు మోసం చేసే కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. తాజాగా ఉప్పల్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అమాయకులను మోసం చేశారు.

  • Published Mar 19, 2024 | 12:17 PMUpdated Mar 19, 2024 | 12:18 PM
Uppal: ఉప్పల్‌లో రియల్‌ ఎస్టేట్‌ మోసం! కోట్ల రూపాయలతో ఉడాయించిన దంపతులు

ప్రస్తుతం సమాజంలో జరిగే మోసాల వలలో చాలా మంది చిక్కుకుంటున్నారు. అటు సైబర్ మోసాలతో పాటు.. సమాజంలో కూడా రోజు రోజుకి మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు వీటి మీద అవహగానా కల్పిస్తున్నా సరే.. ఎంతో మంది అమాయకులు మాయ మాటలకు లొంగిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేసి కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో జరిగే మోసలైతే కోకొల్లలు. తాజాగా హైదరాబాద్ పరిధిలో ఉప్పల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో .. దంపతులు అమాయకులను మోసం చేసి.. కోట్లలో డబ్బును వసూలు చేసి పరారయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తాజాగా ఉప్పల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసాల చిట్టా వెలుగులోకి వచ్చింది. కొంతమంది అమాయకులను నమ్మించి .. వారికీ మాయ మాటలు చెప్పి కొన్ని కోట్ల రూపాయలను కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ కు చెందిన వేలూరి లక్ష్మి నారాయణ, జ్యోతి దంపతులు.. జేవీ బిల్డర్స్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అధిక వడ్డీ పేరుతో ప్రజలకు మాయ మాటలు చెప్పి వారిని నమ్మించి.. వారి వద్ద నుంచి కోట్లలో డబ్బును వసూలు చేశారు. కొన్నాళ్ల తర్వాత బాధితులు తిరిగి వారి డబ్బును అడుగుదాం అనుకున్న సమయానికి .. కార్యాలయం మూసి వేశారు. దీనితో మోసపోయినట్లు గ్రహించిన భాదితులు వెంటనే పోలీసులకు పిర్యాదు చేశారు.

కాగా, ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో బాధితుల పిర్యాదు మేరకు.. పోలీసులు ఆ దంపతులపై చీటింగ్ కేసును నమోదు చేశారు. ప్రస్తుతం లక్ష్మి నారాయణ, జ్యోతి దంపతుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు జనగామ ప్రాంతంలోని తక్కువ భూములు తీసుకుని.. ఆఫర్ అంటూ నమ్మించి ఆ భూమిని ఫార్మ్ లాండ్‌గా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా.. అగ్రిమెంట్ మీదనే కనీసం లక్ష కడితే.. నెలకు 8వేల చొప్పున 20 నెలలకు లక్ష 60వేలు ఇస్తామని చెప్పారని.. కొన్ని నెలలు అలా ఇచ్చి.. అందరిని మోసం చేశారని.. భాదితులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి