iDreamPost

యూపీఐ యూజర్లకు RBI గుడ్‌న్యూస్.. ఇకపై ఇన్ని లక్షలు పంపొచ్చు

  • Published Dec 08, 2023 | 1:51 PMUpdated Dec 08, 2023 | 1:51 PM

నేటి కాలంలో అంతా ఆన్ లైన్ అయ్యింది. చేతిలో డబ్బులు లేకపోయినా సరే.. యూపీఐ పేమెంట్ యాప్స్ ఉంటే చాలు.. ఎక్కడైనా షాపింగ్ చేయవచ్చు. ఈ క్రమంలో తాజాగా ఆర్బీఐ యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచింది. ఆ వివరాలు..

నేటి కాలంలో అంతా ఆన్ లైన్ అయ్యింది. చేతిలో డబ్బులు లేకపోయినా సరే.. యూపీఐ పేమెంట్ యాప్స్ ఉంటే చాలు.. ఎక్కడైనా షాపింగ్ చేయవచ్చు. ఈ క్రమంలో తాజాగా ఆర్బీఐ యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచింది. ఆ వివరాలు..

  • Published Dec 08, 2023 | 1:51 PMUpdated Dec 08, 2023 | 1:51 PM
యూపీఐ యూజర్లకు RBI గుడ్‌న్యూస్.. ఇకపై ఇన్ని లక్షలు పంపొచ్చు

నేటి కాలంలో చేతిలో డబ్బులు పట్టుకుని తిరగడం దాదాపు కనుమరుగయ్యింది. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు, సెల్ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు.. ఎక్కడికైనా వెళ్లి పోవచ్చు.. ఏమైనా కొనుగోలు చేయవచ్చు. కారణం యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి రావడం. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలు మొదలు మెట్రో నగరాలు, రోడ్డు సైడ్ ఉండే దుకాణాలు, బడా బడా మాల్స్.. ఇలా ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ చేయడం కోసం ఫోన్ పే, గూగుల్ ఫే, పేటీఎం వంటి యాప్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి నుంచి భారీ మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేయలేము. చిన్న మొత్తాలకే ఇవి పరిమితం అయ్యాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూపీఐ పేమెంట్స్ చేసేవారికి శుభవార్త చెప్పింది. ట్రాన్సాక్షన్ లిమిట్ ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

యూపీఐ పేమెంట్స్ పరిమితిని పెంచుతూ ఆర్బీఐ నేడు అనగా శుక్రవారం, డిసెంబర్ 8, 2023 న కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ముఖ్యమైన ట్రాన్సాక్షన్లకు సంబంధించి.. ఇక మీదట యూపీఐ పేమంట్స్‌ను రూ. 5 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. వీటిల్లో హాస్పిటల్స్, విద్యా సంస్థలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు సంబంధించి.. గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు మాత్రమే పంపించేందుకు వీలుండేది. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల.. ఇక పై ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా రూ. 5 లక్షల వరకు చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించింది ఆర్‌బీఐ.

మానీటరీ పాలసీ కమిటీ సమావేశాలకు సంబధించి తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఉదయం ప్రకటించారు. ఈ సందర్భంగా యూపీఐ పేమెంట్లకు సంబంధించిన కీలక నిర్ణయాలను వెల్లడించారు. ’వివిధ కేటగిరీలకు సంబంధించి.. యూపీఐ ట్రాన్సాక్షన్ల లిమిట్ ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. తాజాగా హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్లకు సంబంధించి యూపీఐ ట్రాన్సాక్షన్ల లిమిట్‌ను రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించాం‘ అని తెలిపారు గవర్నర్ శక్తికాంత దాస్.

ఆర్‌బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ఇక మీదట యూపీఐ యూజర్లు విద్యాసంస్థలు, ఆరోగ్య పరమైన ఖర్చులకు పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదని తెలిపారు శక్తి కాంత్ దాస్. అలానే యూపీఐలకు సంబంధించి మరో ప్రకటన చేశారు. మ్యూచువల్ ఫండ్స్ సబ్‌స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్స్, క్రెడిట్ కార్డు రీపేమెంట్లకు సంబంధించిన రికరింగ్ పేమెంట్లలో అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ అవసరం లేకుండా రూ. 1 లక్ష వరకు ఆటో పేమెంట్స్ చేయవచ్చని వెల్లడించారు.

రికరింగ్ చెల్లింపుల ఇ-మ్యాండేట్ పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.అంటే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే రూ. 1 లక్ష వరకు ఆటో పేమెంట్ సౌలభ్యాన్ని పొందవచ్చు అన్నమాట. ఇప్పటి వరకు రూ.15 వేలు దాటిన రికరింగ్ పేమెంట్లకు అథెంటికేషన్ అవసరం అయ్యేది. కానీ, ఇకపై రూ. 1 లక్ష వరకు ఎలాంటి అథెంటికేషన్ లేకుండానే పేమెంట్స్ చేయవచ్చని తెలిపారు. తాజా నిర్ణయం వల్ల యూపీఐ కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలు సముకూరుతాయని అంటున్నారు శక్తి కాంత్ దాస్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి