iDreamPost

Paytm ఫాస్ట్ ట్యాగ్ మార్చుకోవాలా వద్దా.. RBI సూచనలు ఇవే!

  • Published Feb 19, 2024 | 1:43 PMUpdated Feb 19, 2024 | 1:43 PM

నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ గేట్స్ వద్ద రుసుము వసూలు చేసే క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకును రద్దు చేసింది. అయితే, మరి ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ ఫాస్టాగ్ అకౌంట్స్ ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఆర్బీఐ వారికీ ఎటువంటి సూచనలను జారీ చేసింది అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.

నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ గేట్స్ వద్ద రుసుము వసూలు చేసే క్రమంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకును రద్దు చేసింది. అయితే, మరి ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ ఫాస్టాగ్ అకౌంట్స్ ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఆర్బీఐ వారికీ ఎటువంటి సూచనలను జారీ చేసింది అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.

  • Published Feb 19, 2024 | 1:43 PMUpdated Feb 19, 2024 | 1:43 PM
Paytm ఫాస్ట్ ట్యాగ్ మార్చుకోవాలా వద్దా.. RBI సూచనలు ఇవే!

ఇటీవల నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా .. టోల్ గేట్స్ వద్ద రుసుము వసులు చేసే.. లిస్ట్ నుంచి .. రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా.. పేటీఎం పేమెంట్స్ బ్యాంకును రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో మార్చి15 తర్వాత వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయాలంటే మాత్రం..ఆర్బీఐ సూచించిన బ్యాంకుల నుంచి మాత్రమే ఫాస్టాగ్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ క్రమంలో ఇప్పటివరకు పేటీఎం ఫాస్టాగ్స్ యూస్ చేసిన కస్టమర్లు.. వేరే అకౌంట్ లో ఉన్న బ్యాలన్స్ ను ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు కాబట్టి.. మార్చి 15లోపు దీనిని వాడుకోవాలి. మరి ఈ క్రమంలో పేటీఎం ఫాస్టాగ్ అకౌంట్ ను వేరే బ్యాంకుకు మార్చుకోవచ్చా లేదా రద్దు చేయాలా ! దీని గురించి ఆర్బిఐ అసలు ఏం చెప్పింది అనే వివరాలు చూద్దాం.

అయితే, పేమెంట్స్ కోసం ఆర్బీఐ సూచించిన బ్యాంకుల లిస్ట్ ఇలా ఉంది. ఈ జాబితాలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ డీఎఫ్ సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్ బిఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్ తో కలిపి మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి . ఈ క్రమంలో మార్చి 15 లోపు ఆల్రెడీ పేటీఎం ఫాస్టాగ్స్ ఉన్న వినియోగదారులు దానిని యూజ్ చేసుకోవాలి . ఆ తర్వాత ఎవరు కూడా పేటీఎం పేమెంట్ బ్యాంక్ నుంచి రుసుము చెల్లించడానికి వీలు లేదు. ఒకవేళ పేటీఎం ఫాస్టాగ్ అకౌంట్ ఉంటే .. దానిని వేరే బ్యాంక్ కు మార్చుకోవచ్చు. లేదా డీయాక్టివేట్ చేయవచ్చని సూచించింది. అలాగే పేటీఎం ఫాస్టాగ్స్ ను ఎలా డీయాక్టివేట్ చేయాలో కూడా సూచించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఫాస్టాగ్ పేటీఎం పోర్టల్ లో.. యూజర్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ తో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. తర్వాత పోర్టల్ లో ఉండే సర్వీస్ రిక్వెస్ట్ లో.. ది ఫాస్టాగ్ క్యాటగిరీ ని ఎంచుకోవాలి. దానిలో హెల్ప్ అండ్ సపోర్ట్ ఆప్షన్ ను క్లిక్ చేసి.. ఎందుకు అకౌంట్ డిలీట్ చేయాలి అనుకుంటున్నారో రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన అభ్యర్ధన ప్రకారం .. ఓ రెఫరెన్సు నెంబర్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన కొంతసమయానికి ఫాస్టాగ్ అకౌంట్ డీఏక్టివేట్ అవుతోంది. ఒకసారి ఫాస్టాగ్ అకౌంట్ డీఏక్టివేట్ అయితే, దానిని మళ్లీ తిరిగి పొందలేరు. కాబట్టి వాహనదారులంతా ఇకపై ఆర్బీఐ సూచించిన ఈ కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి