iDreamPost

మీ ₹500 నోటు నకిలీదా లేదా నిజ‌మైన‌దా? క‌రెన్సీ నోట్ల‌పై ఆర్‌బీఐ కీల‌క ఆదేశాలు

మీ ₹500 నోటు నకిలీదా లేదా నిజ‌మైన‌దా?  క‌రెన్సీ నోట్ల‌పై ఆర్‌బీఐ కీల‌క ఆదేశాలు

కరెన్సీ నోట్లు ఆర్బీఐ నిర్ధేశించిన ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉన్నాయో లేవో నిర్ధారించుకోవడానికి ప్రతి మూడునెల‌ల‌కు ఒక‌సారి నోట్ సార్టింగ్ మిషన్లను టెస్ట్ చేయాల‌ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంకులను కోరింది. ఆర్‌బీఐ నిర్దేశించిన‌ 11 ప్రమాణాలను బ‌ట్టే, నోట్లు నిజ‌మైనా? కావా అనేది నిర్ధారిస్తారు. అందుకే నోట్ల‌ను లెక్క‌బెట్టే మిష‌న్ల‌కు బ‌దులు, వాడ‌టానికివీలైన‌ క‌రెన్సీ నోట్ల‌ను క‌నిపెట్టే నోట్ ఫిట్ సార్టింగ్ మిషన్లను ఉపయోగించాలని బ్యాంకులను ఆదేశించింది ఆర్బీఐ. దెబ్బ‌తిన్న నోట్లను రిసైకిల్ చేయ‌లేరు. ఎందుకంటే వాటి సీరీస్ ల‌ను ఎప్పుడో వాడ‌టం మానేశారు.

ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం, బ్యాంకులు ప్రతి మూడు నెలలకు ఒకసారి, కరెన్సీ నోట్ల ఫిట్‌నెస్ నివేదికలను ఆర్‌బిఐకి పంపాలి. పనికిరాని నోట్ల సీరీస్ ను, సరైన నిర్వహణ తర్వాత తిరిగి జారీ చేయగల నోట్ల గురించి బ్యాంకులు RBIకి తెలియజేయాలి.

2016 నవంబర్‌ నెలలో కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసి, కొత్త రూ.200, రూ.500, రూ.2000నోట్ల సిరీస్‌ను విడుదల చేసింది. అయితే కొత్త సిరీస్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టినందున‌ ఆర్బీఐ నోట్ల ప్రామాణీకరణ, డబ్బులు లెక్కించే ఫిట్‌నెస్ సార్టింగ్ మెషిన్‌ల పనితీరును, ఎప్పటికప్పుడు ఎలా సమీక్షించాలో కొత్త మార్గ దర్శకాల్ని విడుదల చేసింది.

నోట్ సార్టింగ్ మెషీన్స్ అథెంటికేషన్, ఫిట్‌నెస్ సార్టింగ్ పారామీటర్స్’ అనే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఫిట్ నోట్ అనేది శుభ్రంగా ఉండే నోటు. రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంద‌ని పేర్కొంది.

నోటు మురికిప‌ట్టి, చిరిగిపోయి, చివ‌ర్లు పాడైపోయి, రాత‌లుండి, స్టిఫ్ నెస్ లేని నోట్లు రీసైక్లింగ్‌కు పనికొస్తాయా? తెలుసుకోవాలి. ఒక‌వేళ కొత్త నోట్లు రీసైక్లింగ్ కు ప‌నికిరాద‌ని తేలితే, ఆ కరెన్సీ నోట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్త నోట్లను ఆర్బీఐ త‌యారుచేయిస్తుంది. అంటే, రీసైక్లింగ్‌కు ప‌నికివ‌చ్చే నోట్లను ఉప‌యోగించాలి. ఇప్పుడున్న నోట్ల లెక్కింపు మిషీన్ లు కేవ‌లం వాటిని లెక్క మాత్ర‌మే పెడ‌తాయి. నోట్ సార్టింగ్ మెషీన్స్ ఫేక్‌ కరెన్సీ నోట్లు, చెలామణికి పనికి రాని నోట్లను గుర్తించి, వాటిని వేరు చేయగలగాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి