iDreamPost

నువ్వూ నేనూ రజినీకాంతే.. కానీ అదొక్కటే తేడా! అశ్విన్ తో జోడీపై జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తన బౌలింగ్ పార్ట్ నర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రవీంద్ర జడేజా. అశ్విన్, నేనూ రజినీకాంత్ లమే అని, కానీ మా ఇద్దరి మధ్య అదొక్కటే తేడా అంటూ ఆసక్తికర పోలికను తెరపైకి తీసుకొచ్చాడు. ఈ వివరాల్లోకి వెళితే..

తన బౌలింగ్ పార్ట్ నర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రవీంద్ర జడేజా. అశ్విన్, నేనూ రజినీకాంత్ లమే అని, కానీ మా ఇద్దరి మధ్య అదొక్కటే తేడా అంటూ ఆసక్తికర పోలికను తెరపైకి తీసుకొచ్చాడు. ఈ వివరాల్లోకి వెళితే..

నువ్వూ నేనూ రజినీకాంతే.. కానీ అదొక్కటే తేడా! అశ్విన్ తో జోడీపై జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజా ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అరుదైన ఘనతను నెలకొల్పారు. వీరిద్దరు కలిసి 500కు పైగా వికెట్లు తీసి, భారత దిగ్గజ బౌలర్లు అయిన అనిల్ కుంబ్లే-హర్భజన్ సింగ్ రికార్డును బద్దలుకొట్టారు. మరోవైపు అశ్విన్ కూడా 100 టెస్టులు ఆడి, 500కు పైగా వికెట్లను కూల్చాడు. దీంతో అతడిని తమిళనాడు క్రికెట్ సంఘం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా తన బౌలింగ్ పార్ట్ నర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రవీంద్ర జడేజా. అశ్విన్, నేనూ రజినీకాంత్ లమే అని, కానీ మా ఇద్దరి మధ్య అదొక్కటే తేడా అంటూ ఆసక్తికర పోలికను తెరపైకి తీసుకొచ్చాడు.

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వంద టెస్టులు, 500 వికెట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అతడిని ఘనంగా సన్మానించింది. అశ్విన్ పేరుపై స్టాంప్ ను విడుదల చేయడమే కాక.. రూ. కోటి రూపాయలను కూడా బహుమతిగా ఇచ్చింది. ఈ విశేషాన్ని పురస్కరించుకుని అశ్విన్ సహచరుడు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో తనతో పాటుగా అశ్విన్ ను కూడా పోల్చాడు. సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

“అశ్విన్ భాయ్ నువ్వు 100 టెస్టులు ఆడటం, 500 వికెట్లు తీయడం నాకెంతో సంతోషం. దానికి నీకు నా శుభాకాంక్షలు. మీరు భారత క్రికెట్ కు చేసిన సేవలు అద్వితీయం. ఫ్యూచర్ లోనూ ఇలాగే వికెట్లు తీస్తుండాలి. అలాగే నీ మాస్టర్ మైండ్ తో నాకు సలహాలు ఇస్తుండాలి. అయితే నేను కూడా వికెట్లు తీసి నీ స్థాయికి వస్తాను. మన ఇద్దరి పేర్లు ఒక్కటే కావడంతో.. ఈ సందర్భంగా నాకు ఓ మూవీ పేరు గుర్తుకొస్తోంది. నువ్వు రవి చంద్రన్.. నేను రవి ఇంద్రన్.. గమ్మత్తు ఏంటంటే? నువ్వేమో మీసం లేని చంద్రన్, నేనేమో మీసమున్న ఇంద్రన్” అంటూ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాతో పోల్చాడు. కాగా.. 1981లో వచ్చిన రజినీకాంత్ సినిమా ‘థిల్లు-ముల్లు’ పాత్రలను ఈ సందర్భంగా గుర్తుచేశాడు రవీంద్ర జడేజా. ప్రస్తుతం జడ్డూ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ క్రేజీ పోలికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భారత గడ్డపై అడుగుపెట్టిన రన్ మెషిన్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి