iDreamPost

అయోధ్యలో రాముడి గుడి కట్టాకే పెళ్లి.. 31 ఏళ్ల క్రితం భక్తుడి శబథం! నేడు ఆహ్వానం!

Ayodhya Ram mandir: ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువులు ఎన్నో ఏళ్లుగా కన్న కల అయోధ్య రామమందిరం. ఇక రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉండే పలువురు ప్రముఖులను అయోధ్య ట్రస్టు ఆహ్వానిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Ayodhya Ram mandir: ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువులు ఎన్నో ఏళ్లుగా కన్న కల అయోధ్య రామమందిరం. ఇక రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉండే పలువురు ప్రముఖులను అయోధ్య ట్రస్టు ఆహ్వానిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అయోధ్యలో రాముడి గుడి కట్టాకే పెళ్లి.. 31 ఏళ్ల క్రితం భక్తుడి శబథం! నేడు ఆహ్వానం!

అయోధ్య రామమందిరం.. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువులు ఎన్నో ఏళ్లుగా కన్న కల. అలాంటి కల నిజమయ్యే రోజులు ఆసన్న అవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయం అతి త్వరలో పూర్తి కానుంది. అంతేకాక రామమందిరంలో రామయ్య కొలువు దీరనున్నారు. ఇక రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉండే పలువురు ప్రముఖులను అయోధ్య ట్రస్టు ఆహ్వానిస్తుంది. ఇప్పటికే పలువురికి ఈ కార్యక్రమానికి సంబధించిన ఆహ్వానాలు అందుతున్నాయి. తాజాగా భోపాల్‌కు చెందిన భోజ్‌పాలి బాబాకు ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ, ప్రముఖులు, సాధువులతో పాటు రామయ్య ప్రతిష్టాపనకు ఆహ్వానం అందుకున్న ఈయన ఎవరు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అయోధ్య రామ మంది నిర్మాణం కోసం ఎంతో మంది కృషి చేశారు. చాలా మంది కోర్టుల్లో పోరాటలు చేశారు. అంతేకాక వివిధ రకాలుగా రామ మందిర నిర్మాణం కోసం కృషి చేశారు. అలా ఎంతో మంది కృషి ఫలితం, కోర్టుల తీర్పులతో రామయ్య మందిర నిర్మాణ కల సాకారం కానుంది. ఇక అయోధ్య రాముడి గుడి కోసం భోజ్ పాలి బాబా.. ఎవరు తీసుకోని ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ కి చెందిన భోజ్‌పాలి బాబా అసలు పేరు రవీంద్ర గుప్తా. ఆయనకు చిన్నతనం నుంచి దేవుళ్లపై అపారమైన నమ్మకం, భక్తి. నిత్యం దేవుళ్లకు పూజలు చేస్తూ కాలం గడిపేవాడు.

అంతేకాక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ క్రమంలోనే దాదాపు 31 ఏళ్ల క్రితం ఓ శబధం చేశారు.  6 డిసెంబర్ 1992న తన స్నేహితులతో కలిసి కరసేవలో పాల్గొనడానికి అయోధ్యకు వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ రామ జన్మభూమి అయోధ్య నగరంలో రామ మందిరం నిర్మించే విషయంలో జరుగుతున్న అలసత్వాని గుర్తించి..కలత చెందారు. ఇక రామ మందిర నిర్మాణం జరిగే వరకు పెళ్లి చేసుకోనని రవీంద్ర ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు రవీంద్ర వయస్సు కేవలం 22 సంవత్సరాలు. 31 ఏళ్ల క్రితం అలా శబథం చేసిన రవీంద్ర గుప్తా.. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. అలా రవీంద్ర గుప్తా కాస్తా భోజ్‌పాలి బాబాగా మారి మూడు దశాబ్దాలుగా శ్రీరాముని సేవలో తరిస్తున్నాడు.

రవీంద్ర ఇప్పటి వరకు నర్మదా నదికి 5 సార్లు ప్రదక్షిణలు చేశాడు. అంతేకాక తన స్వగ్రామం నుంచి బయటకు వచ్చి.. బేతుల్ సమీపంలో మిలాన్పూర్ లో నివాసం ఉంటున్నారు. ఆర్ఎస్ఎస్ లో ఆయన క్రియాశీలకంగా ఉన్న సమయంలో  కొందరు ఆయనకు నివాసానికి ఏర్పాట్లు చేశారు. తాజాగా బేతుల్ చిరునామాతో అయోధ్య నుండి భోజ్‌పాలి బాబాకి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు అయోధ్య  రామ మందిర ఉత్సాహాన్ని కలిగించిందని.. డిసెంబర్ 6న తన స్నేహితులతో కలిసి కర సేవలో పాల్గొన్నాని గుర్తు చేశారు.

ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు కర సేవలో పాల్గొనడానికి నిరాకరించారని తెలిపాడు.  దీంతో కట్టుబట్టలతో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అయోధ్యకు చేరుకుని రామమందిరం నిర్మించే పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. కరసేవ సమయంలో అయోధ్య నుండి ఇటుకలు కూడా తెచ్చానని గుర్తుచేశారు. ఇక భోజ్ పాల్ బాబా తీసుకున్న ఈ నిర్ణయానికి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారంట. దీంతో వారిని ఎదిరించి బాబా దాదాపు 12 సంవత్సరాలు ఒంటరిగా భోపాల్‌లో గడిపారు. 2004 వరకు విద్యార్థి పరిషత్,ఆర్ఎస్ఎస్ లో క్రియాశీల పాత్ర పోషించారు.

అలానే 2007లో వీహెచ్ పీలో పూర్తిస్థాయి సంస్థాగత వ్యక్తిగా పనిచేశారు. ఇప్పుడు రామ మందిరానికి ఆహ్వానం అందినందుకు భోజ్ పాల్ బాబా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 21 ఏళ్ల క్రితం తాను చేసిన శబథానికి బాబా కట్టుబడి ఇంతకాలం రాముడి సేవలో ఉన్నారు. ప్రస్తుతం 53 ఏళ్ల వయస్సున భోజ్‌పాలి బాబా.. తన జీవితం నర్మదానది కోసం, దేశ సేవలో గడుపుతానని చెప్పుకొచ్చారు. మరి.. రాముడి కోసం బ్రహ్మచారిగా మారిన ఈ బాబాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి