iDreamPost

Khiladi : మరోసారి మార్గదర్శిగా మారుతున్న రవితేజ

Khiladi : మరోసారి మార్గదర్శిగా మారుతున్న రవితేజ

థియేటర్లు డల్ గా ఉన్నాయి. ఒక్క బంగార్రాజు సందడి అన్ని హాళ్లకు సరిపోవడం లేదు. జనం మళ్ళీ ఓటిటిల వైపు వెళ్తున్నారు. హీరో, రౌడీ బాయ్స్ రెండూ అంతంత మాత్రంగానే ఆడటంతో టికెట్ కౌంటర్ల దగ్గర సందడి తక్కువగానే ఉంది. ఫిబ్రవరి 4న చెప్పుకోదగ్గ సినిమాలు వస్తాయా రావా అనేది అనుమానంగానే ఉంది. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు 11న రాబోతున్న రవితేజ ఖిలాడీ మీదే ఉన్నాయి. అదే రోజు షెడ్యూల్ చేసుకున్న అడవి శేష్ మేజర్ వాయిదా పడింది కానీ మాస్ మహారాజా మాత్రం వెనక్కు తగ్గడని అర్థమైపోయింది. ఈ మేరకు కొత్త పోస్టర్లలో డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. సో నో డౌట్.

గత ఏడాది కూడా లాక్ డౌన్ తర్వాత బాక్సాఫీస్ నీరసంగా ఉన్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై శాతం ఆక్యుపెన్సీతోనూ రవితేజ క్రాక్ అదరగొట్టి మిగిలినవాటికి ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే ఊపు నెలల పాటు కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ రవితేజనే మరోసారి లీడ్ తీసుకోబోతున్నాడు. తెలంగాణలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఏపిలో వచ్చే నెల కూడా నిబంధనలు కొనసాగిస్తారో లేదో తెలియదు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య పెద్దగా లేకపోవడం సంతోషించాల్సిన విషయం. పాజిటివ్ వచ్చిన వారు కూడా తక్కువ టైంలోనే ఇంట్లోనే కోలుకుంటున్నారు. సో నిరుటిలాగా పరిస్థితి మరీ సీరియస్ గా లేదన్న మాట వాస్తవం.

ఖిలాడీని ఇంత రిస్క్ లోనూ తీసుకురావడానికి కారణాలు ఉన్నాయి. బంగార్రాజు తర్వాత మాస్ ఆడియన్స్ కి బాగా గ్యాప్ వచ్చేసింది. దాన్ని ఫీల్ చేయాలంటే స్టార్ హీరో సినిమా రావాలి. ఖిలాడీలో ఆ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అనసూయ లాంటి క్యాస్టింగ్ ఇలా చాలా ఆకర్షణలు ఉన్నాయి. సో టాక్ బాగుందని వస్తే చాలు రికార్డులు వచ్చి పడతాయి. ఇది కనక సక్సెస్ అయితే ఆలస్యం చేయకుండా మిగిలిన సినిమాలు కూడా రిలీజ్ డేట్లను ప్రకటించేస్తాయి. చిన్నా చితకా చిత్రాలతో ఎక్కువ రోజులు ఎగ్జిబిటర్లు రన్ చేయలేరు కాబట్టి వీలైనంత త్వరగా ఖిలాడీ లాంటివి రావడం చాలా అవసరం

Also Read : April 28th Releases : ఈ రిలీజ్ డేట్ వెనుక ఇంత కథ ఉంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి