iDreamPost

Ravi Teja: రవితేజ, విశ్వక్​సేన్ కాంబోలో మల్టీస్టారర్! విలన్ రోల్​లో మంచు మనోజ్?

  • Author singhj Published - 07:20 PM, Tue - 4 July 23
  • Author singhj Published - 07:20 PM, Tue - 4 July 23
Ravi Teja: రవితేజ, విశ్వక్​సేన్ కాంబోలో మల్టీస్టారర్! విలన్ రోల్​లో మంచు మనోజ్?

టాలీవుడ్​లో మల్టీస్టారర్ ట్రెండ్ క్రమంగా ఊపందుకుంటోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో తెలుగు నాట ఈ ట్రెండ్ మళ్లీ మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత ‘మనం’, ‘బాహుబలి’, ‘గోపాల గోపాల’ చిత్రాల్లోనూ ఇదే కొనసాగింది. రీసెంట్​గా చూసుకుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ ఈ ట్రెండ్​కు మరింత ఊపు తీసుకొచ్చింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రెండు బడా ఫ్యామిలీలకు చెందిన స్టార్ హీరోలు కలసి ఒకే సినిమాలో నటించడం ద్వారా అసలైన మల్టీస్టారర్ అంటే ఎలా ఉంటుందో ఆడియెన్స్​కు చూపించారు. ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్, రామ్​చరణ్ కలసి స్క్రీన్​పై చేసిన సందడిని ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తెలుగులో వచ్చిన మరో భారీ మల్టీస్టారర్​గా మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘వాల్తేరు వీరయ్య’ను చెప్పొచ్చు. ఇందులో చిరుతో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటించారు. ఈ మూవీ మెగాహిట్​గా నిలిచింది. దీంతో ఈ తరహా సినిమాల నిర్మాణం ఊపందుకుంటోంది. తెలుగులో మరో భారీ మల్టీస్టారర్​కు అంతా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ, మాస్ కా దాస్​ విశ్వక్​సేన్ కలసి ఒక మూవీ చేయనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు ‘కలర్ ఫొటో’ చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్షన్ వహించనున్నట్లు టాక్. రవితేజ-విశ్వక్​సేన్ కాంబోలో తెరకెక్కుతుందని చెబుతున్న మూవీలో మరో స్టార్ హీరో కూడా యాక్ట్ చేయనున్నారట.

ఈ ఫిలింలో విలన్ రోల్ కోసం మంచు మనోజ్​ను దర్శకుడు సంపత్ రాజ్ సంప్రదించారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మాస్​లో భారీ ఫాలోయింగ్​ ఉన్న రవితేజకు తోడుగా యంగ్ సెన్సేషన్ విశ్వక్​సేన్, మంచు మనోజ్ కూడా తోడైతే ఇక ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్​లో ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రేజీ మల్టీస్టారర్ పట్టాలెక్కితే మాత్రం దర్శకుడు సందీప్ రాజ్​ బంపర్ ఆఫర్ కొట్టినట్లే. అయితే ఇప్పటివరకు ఈ మల్టీస్టారర్​పై వస్తున్న వార్తల మీద డైరెక్టర్ సందీప్ స్పందించలేదు. రవితేజ, విశ్వక్​సేన్, మంచు మనోజ్​ల నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి.. ఈ క్రేజీ కాంబోలో మల్టీస్టారర్ గురించి మీరు ఎదురు చూస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి