iDreamPost

డిసెంబర్ పైనే రష్మిక ఆశలు.. అంత స్పెషల్ ఎందుకు?

  • Author ajaykrishna Updated - 11:09 AM, Sat - 12 August 23
  • Author ajaykrishna Updated - 11:09 AM, Sat - 12 August 23
డిసెంబర్ పైనే రష్మిక ఆశలు.. అంత స్పెషల్ ఎందుకు?

పాన్ ఇండియా హిట్ పడ్డాక హీరోయిన్స్ క్రేజ్ ఎలా చేంజ్ అవుతుందో తెలిసిందే. ఒక్కసారిగా వేరే ఇండస్ట్రీల నుండి ఆఫర్స్ వస్తుంటాయి. కెరీర్ లో ఊహించని విధంగా బిజీ అవుతుంటారు. అలా చేతిలో సినిమాలుంటే చాలు అనుకునే స్టేజ్ నుండి.. ఇప్పుడు వచ్చిన సినిమాలను సైతం రిజెక్ట్ రేంజ్ కి చేరుకుంది రష్మిక మందన. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. కన్నడలో కెరీర్ ప్రారంభించినప్పటికీ.. స్టార్డమ్ మాత్రం తెలుగులోనే సంపాదించుకుంది. ఛలో సినిమా తర్వాత గీతగోవిందం.. సరిలేరు నీకెవ్వరూ.. భీష్మా.. లాంటి వరుస విజయాల తర్వాత అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమా చేసింది. ఆ సినిమాతో ఒక్కసారిగా రష్మిక కెరీర్ టర్న్ అయిపోయింది.

మాస్ యాక్షన్ మూవీగా బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప.. పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక సినిమాతో పాటు బన్నీకి, రష్మికకు పాన్ ఇండియా స్టార్డమ్ లభించింది. అక్కడినుండి అమ్మడికి వరుసగా కోలీవుడ్, బాలీవుడ్ నుండి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు క్యూ కట్టాయి. అలా దళపతి విజయ్ సరసన వారసుడు, రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా అవకాశాలు అందుకుంది. ఈ ఏడాది వారసుడు విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. మరోవైపు యానిమల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో తనకు డిసెంబర్ నెల చాలా స్పెషల్.. లక్కీ మంత్ అంటోంది రష్మిక.

మరి రష్మికకు డిసెంబర్ నెల అంత స్పెషల్ ఎందుకు? అనే వివరాల్లోకి వెళ్తే.. రష్మిక ఫస్ట్ సినిమా కిరాక్ పార్టీ, ఫస్ట్ పాన్ ఇండియా హిట్ పుష్ప సినిమాలు డిసెంబర్ లోనే విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. ఈ రెండు సినిమాలు అమ్మడికి ఎంతో కీలకం. ఇప్పుడు రణబీర్ కపూర్ తో చేస్తున్న యానిమల్ సినిమా కూడా డిసెంబర్ లోనే రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ.. “డిసెంబర్ నాకు ఎప్పుడూ లక్కీనే. ఎందుకంటే.. కిరాక్ పార్టీ, చమక్, అంజనీపుత్ర, పుష్ప సినిమాలు ఈ నెలలో రిలీజై మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఇప్పుడు డిసెంబర్ లో నా ఐదవ సినిమాగా యానిమల్ రాబోతుంది.” అని చెప్పింది. ఈ లెక్కన డిసెంబర్ పై రష్మిక ఎన్ని ఆశలు పెట్టుకుందో అర్ధమవుతుంది. ప్రస్తుతం రష్మిక యానిమల్ తో పాటు పుష్ప 2, రెయిన్ బో సినిమాలు చేస్తోంది. మరి రష్మిక సెంటిమెంట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి