iDreamPost

VIDEO: పాక్‌ ఓటమి.. రషీద్‌ ఖాన్‌తో కలిసి డాన్స్‌ వేసిన టీమిండియా క్రికెటర్‌!

  • Published Oct 24, 2023 | 3:05 PMUpdated Oct 24, 2023 | 3:05 PM

సోమవారం పాక్‌పై ఆఫ్ఘాన్‌ విజయం సాధించడంతో సంతోషంలో రషీద్‌ ఖాన్‌తో కలిసి టీమిండియా స్టార్‌ మాజీ క్రికెటర్‌ డాన్స్‌ చేశాడు. ప్రస్తుతం వీరి డాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి డాన్స్‌ వేసిన ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడ చూద్దాం..

సోమవారం పాక్‌పై ఆఫ్ఘాన్‌ విజయం సాధించడంతో సంతోషంలో రషీద్‌ ఖాన్‌తో కలిసి టీమిండియా స్టార్‌ మాజీ క్రికెటర్‌ డాన్స్‌ చేశాడు. ప్రస్తుతం వీరి డాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి డాన్స్‌ వేసిన ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడ చూద్దాం..

  • Published Oct 24, 2023 | 3:05 PMUpdated Oct 24, 2023 | 3:05 PM
VIDEO: పాక్‌ ఓటమి.. రషీద్‌ ఖాన్‌తో కలిసి డాన్స్‌ వేసిన టీమిండియా క్రికెటర్‌!

వరల్డ్ కప్‌ 2023లో మరో సంచలనం నమోదైంది. టోర్నీకి ముందు టైటిల్‌ ఫేవరేట్లలో ఒకటిగా ఉన్న పాకిస్థాన్‌ టీమ్‌ను పసికూన ఆఫ్ఘనిస్థాన్‌ చిత్తుగా ఓడించింది. ఇప్పటికే ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆఫ్ఘాన్‌ జట్టు.. తాజాగా చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. అయితే.. ఈ విజయం తర్వాత ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్‌పై విజయం సాధించడంతో ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌ మొత్తం సంబురాలు చేసుకుంది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ అయితే.. ఏకంగా ఆఫ్ఘాన్‌ జాతీయ జెండాతో గ్రౌండ్‌లో ఎంతో సంతోషం గడిపాడు.

అతనితో పాటు టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ ఫఠాన్‌ సైతం డాన్స్‌ వేయడం విశేషం. సాధారణంగా పాకిస్థాన్‌పై సెటైర్లు వేస్తూ.. పాక్‌ ఫ్యాన్స్‌ను ఆటపట్టించే పఠాన్‌.. సోమవారం పాక్‌పై ఆఫ్ఘాన్‌ విజయం సాధించడంతో సంతోషంలో రషీద్‌ ఖాన్‌తో కలిసి డాన్స్‌ చేశాడు. ప్రస్తుతం వీరి డాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్టేడియంలో నిలబడి కామెంటరీ చెప్తున్న టీమిండియా మాజీ లెజెండ్ ఇర్ఫాన్ పఠాన్ దగ్గరకు ఆఫ్ఘన్ టీం వెళ్లింది. వీరిని చూడగానే పఠాన్ డాన్స్‌ చేస్తూ ముందుకొచ్చాడు. ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా డాన్స్‌ చేస్తూ పఠాన్‌ను హగ్‌ చేసుకున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఇర్ఫాన్ పఠాన్.. ‘రషీద్ తన మాట నిలబెట్టుకున్నాడు. అందుకే నేను నా మాట నిలబెట్టుకున్నా’ అంటూ కామెంట్ చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఓపెనర్‌ షఫీక్‌ 58, కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 74, షదాబ్‌ ఖాన్‌ 40, ఇఫ్తికార్‌ అహ్మద్‌ 40 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది ఆఫ్ఘాన్‌ జట్టు. చెన్నై పిచ్‌ స్పిన్‌కి అనుకూలంగా ఉంటుందని భావించి వాళ్లు టీమ్‌లో మార్పులు చేశారు. వారి స్ట్రాటజీ బాగానే వర్క్‌ అవుట్‌ అయింది. ముజీబ్‌, నబీ, రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. వరల్డ్‌ కప్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న నూర్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

ఇక కోహ్లీ ఫ్రెండ్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ 2 వికెట్లతో రాణించాడు. నబీ, అజ్మతుల్లా చెరో వికెట్‌ తీశారు. ముజీబ్‌, రషీద్‌ ఖాన్‌లకు వికెట్‌ పడకపోయినా.. కట్టుదిట్టంగా వేశారు. ఇక 283 పరుగుల టార్గెట్‌ను ఆఫ్ఘాన్‌ ఎంతో కంఫర్ట్‌బుల్‌గా ఛేదించింది. 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 286 రన్స్‌ చేసి గెలిచింది. ఓపెనర్లు గుర్బాజ్‌ 65, ఇబ్రహీం జద్రాన్‌ 87 అద్భుతమైన స్టార్ట్‌ ఇచ్చారు. తర్వాత రహమత్‌ 77, హస్మతుల్లా 48 మరో వికెట్‌ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. మొత్తం మీద ఈ మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో నెగ్గిన ఆఫ్ఘాన్‌ ఈ వరల్డ్‌ కప్‌లో 2వ విజయాన్ని నమోదు చేసింది. మరి ఆఫ్ఘాన్‌ విజయంతో పాటు రషీద్‌ ఖాన్‌-ఇర్ఫాన్‌ పఠాన్‌ డాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ విషయంలో రోహిత్-కోహ్లీ మధ్య వాదన! ఏకంగా గ్రౌండ్​లోనే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి