iDreamPost

కెమెరాకు చిక్కిన అర్ధనారీశ్వరం పక్షి! సగం ఆడ, సగం మగ..!

Rare Half Female Half Male Bird: ప్రపంచంలో ఎన్నో రకాల పక్షి జాతులు ఉన్నాయి.. వాటిలో చాలా వరకు పొలుష్యన్, రేడియేషన్ కారణంగా అంతరించిపోతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని మనం ఎన్నోె రకాల అరుదైన పక్షులు చూడగలుగుతున్నాం.

Rare Half Female Half Male Bird: ప్రపంచంలో ఎన్నో రకాల పక్షి జాతులు ఉన్నాయి.. వాటిలో చాలా వరకు పొలుష్యన్, రేడియేషన్ కారణంగా అంతరించిపోతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని మనం ఎన్నోె రకాల అరుదైన పక్షులు చూడగలుగుతున్నాం.

కెమెరాకు చిక్కిన  అర్ధనారీశ్వరం పక్షి! సగం ఆడ, సగం మగ..!

ఈ ప్రకృతిలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి.. కానీ అందులో కొన్ని మాత్రమే మనం చూడగలం. అభయారణ్యం ఎన్నో రకాల పక్షి జాతులకు ఆవాసమైంది.  డిస్కవరీ ఛానల్స్ పుణ్యమా అని ఎన్నోరకాల పక్షి జాతులను చూడగలుగుతున్నాం. మన దేశంలో ఎన్నో అందమైన పక్షులు ఉన్నాయి.. సుమారు 1200 రకాల పక్షులు ఉన్నాయని అంచనా. ఇటీవల పెరుగుతున్న కాలుష్యం, సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే రేడియేషన్ వల్ల ఎన్నో పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలోనే పక్షుల జాతులను కాపాడే పనిలో పడ్డారు.. అందుకోసం ఎన్నో పక్షుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు బర్డ్ లవర్స్. కొలంబియాలో పక్షి శాస్త్రవేత్త ఓ అరుదైన పక్షిని గుర్తించారు. వివరాల్లోకి వెళితే..

కొలంబియాలోని మనిజెల్స్ సిటీకి పది కిలోమీటర్ల దూరంలో ఓ అటవీ ప్రాంతంలో పక్షి శాస్త్రవేత్త ఓ అరుదైన పక్షి జాతిని గుర్తించారు. మీరు ఎప్పుడైనా సగం ఆడ-సగం మగ లక్షణాలు ఉన్న పక్షిని చూశారా? అసలు ఇలాంటి పక్షులు ఉంటాయా? అన్న డౌట్ మీకు వస్తుంది. అయితే ఈ పక్షులు కొలంబియాలో ఉన్నాయి.. ఈ పక్షి పేరు ఆకుపచ్చ హనీక్రీపర్ (క్లోరోఫేన్స్ స్పిజా). గత వందేళ్లలో ఈ పక్షి కేవలం రెండు సార్లు మాత్రమే కనిపించిందని పరిశోదక బృందం తెలిపారు. ఈ పక్షి ఎంతో ప్రత్యేకతలు కలిగినదని అంటున్నారు. ఈ పక్షి గురించి న్యూజిలాండ్ శాస్త్రవేత్త హమీష్ స్పెన్సర్ మాట్లాడుతూ.. ‘కొలంబియాలో అరుదైన పక్షిని కనుగొన్నాం.. ఈ పక్షి సగం ఆకుపచ్చ, సగం నీలి రంగుతో ఉంది. న్యూజిలాండ్ లో ఇలాంటి పక్షిని ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి పక్షని గత వందేళ్లలో రెండు సార్లు మాత్రమే చూడగలిగాం. ఈ పక్షికి ఆడ, మగ రెండు పునరుత్పత్తి అంగాలు ఉన్నాయి.  ఈ పక్షి సగం ఆకుపచ్చ ఈకలు అంటే ఆడ, సగం నీలం రంగు ఈకలు అంటే మగ అని అర్థం. మగ ఈకలు ఉండి అందుకు అనుగుణంగా పురుష పునరుత్పత్తి అవయవాలు, స్త్రీ ఈకలు ఉండి స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాాలు ఉంటాయి’ అని అన్నారు.

ఈ పక్షులు ఇలా ఉండడానికి జన్యుపరమైన లోపాలే ఇందుకు కారణం అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలా ఏ జాతి పక్షిలో ద్వైపాక్షిక గైనండ్రోమోర్స్.. అంటే ఆడ, మగ లక్షణాలు ఎక్కడా చూడలేదని అంటున్నారు. ఈ పరిస్థితి స్త్రీ కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి అరుదైన పక్షులు పుట్టుకు వస్తాయని అంటున్నారు. ఒక గుడ్డు, రెండు స్పెర్మ్‌ ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఈ విధమైన మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్త హమీష్ స్పెన్సర్ అంటున్నారు. సాధారణంగా ఈ పక్షులు ఇతర పక్షులకు చాలా దూరంగా ఉంటాయి. వేరే పక్షులకు భిన్నంగా ఉంటాయి. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు జర్నల్ ఆఫ్ ఫీల్డ్ ఆర్నిథాలజీలో ప్రింట్ కాబడ్డాయి. అయితే ఈ పక్షి ఆడ, మగ కలగలిసి ఉండటాన్ని అర్ధనారీశ్వర పక్షి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి