iDreamPost

డ్రెస్సింగ్​ రూమ్​లో రంజీ ప్లేయర్లతో రోహిత్.. టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పాడు!

  • Published Mar 12, 2024 | 4:35 PMUpdated Mar 12, 2024 | 4:35 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ ప్లేయర్లతో కలసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ఒక్క చర్యతో తన టార్గెట్ ఏంటో హిట్​మ్యాన్ చెప్పకనే చెప్పాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ ప్లేయర్లతో కలసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ఒక్క చర్యతో తన టార్గెట్ ఏంటో హిట్​మ్యాన్ చెప్పకనే చెప్పాడు.

  • Published Mar 12, 2024 | 4:35 PMUpdated Mar 12, 2024 | 4:35 PM
డ్రెస్సింగ్​ రూమ్​లో రంజీ ప్లేయర్లతో రోహిత్.. టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పాడు!

భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ట్రాన్సిషన్ స్టేజ్​లో ఉంది. అటు టీ20ల నుంచి ఇటు టెస్టుల వరకు జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా లాంగ్ ఫార్మాట్​లో టీమ్ మేనేజ్​మెంట్, సెలక్టర్లు కలసి చాలా ఛేంజెస్ చేస్తున్నారు. సీనియర్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానె ఫామ్ లేమి కారణంగా టీమ్​కు దూరమయ్యారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా వెటరన్ పేసర్ మహ్మద్ షమి, స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్​ కూడా ఇంగ్లండ్​తో సిరీస్​లో ఆడలేదు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, ఆకాశ్​ దీప్, రజత్ పాటిదార్, దేవ్​దత్ పడిక్కల్​ రూపంలో కొత్త రక్తాన్ని జట్టుకు ఎక్కించారు సెలక్టర్లు. వీళ్లలో పాటిదార్ తప్ప అందరూ సక్సెస్ అయ్యారు. వీళ్లందరూ డొమెస్టిక్​ క్రికెట్​లో దుమ్మురేపి వచ్చినవారే. కెప్టెన్ రోహిత్​తో పాటు టీమ్ మేనేజ్​మెంట్ అండగా నిలవడం వల్లే వీళ్లు విజయవంతం అయ్యారు. ఈ నేపథ్యంలో హిట్​మ్యాన్ అందరికీ మరోమారు తన ఉద్దేశం ఏంటో చెప్పాడు.

రంజీ ట్రోఫీ-2024లో భాగంగా ముంబై, విదర్భ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్​కు ఉన్నట్లుండి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చాడు. ముంబై డ్రెస్సింగ్ రూమ్​లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు హిట్​మ్యాన్. అక్కడ ప్లేయర్లతో కలసి ముచ్చటిస్తూ, నవ్వుతూ కనిపించాడు. తాను నివసించే ముంబైలో మ్యాచ్ జరుగుతుండటంతో అతడు అక్కడికి విచ్చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్​లో రోహిత్​ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే హిట్​మ్యాన్ ఏదో సరదాగా మ్యాచ్ చూసేందుకు వచ్చాడని అనుకుంటే పొరపాటే. ఈ మధ్య భారత క్రికెట్​లో జరిగిన పలు పరిణామాలు, టీమిండియా ట్రాన్సిషన్ ఫేస్​లో ఉండటాన్ని బట్టి రోహిత్ రాకకు పలు కారణాలు కనిపిస్తున్నాయి.

రంజీ ట్రోఫీతో పాటు డొమెస్టిక్ క్రికెట్​కు భారత టీమ్ మేనేజ్​మెంట్, బీసీసీఐ ఎంత ప్రాధాన్యత ఇస్తోందో రోహిత్ రాకతో తేలిపోయింది. ఇక మీదట టీమిండియాకు ఎంపికవ్వాలన్నా, జట్టులో కొనసాగాలన్నా డొమెస్టిక్ లెవల్​కు అందరూ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందేనని ఈ చర్యతో హిట్​మ్యాన్ చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది. రంజీ క్రికెటర్ల ఆటను అందరూ గమనిస్తున్నారు, దీనికి ఎంతో వ్యాల్యూ ఉందని స్వయంగా తన రాకతో వారిలో కాన్ఫిడెన్స్ నింపినట్లు అవుతుందనేది కూడా రోహిత్ ఉద్దేశమని కొందరు అంటున్నారు. మార్పు దశలో ఉన్న భారత జట్టుకు మరింత మంది ప్రతిభావంతులైన యువకులు కావాలి. వాళ్లు డొమెస్టిక్​ క్రికెట్​లోనే దొరుకుతారు. కాబట్టి ఇక్కడ ఆడేవారిని తాము గమనిస్తున్నామని.. బాగా రాణిస్తే చోటు పక్కా అని ఇన్​డైరెక్ట్​గా హిట్​మ్యాన్ సిగ్నల్స్ కూడా పంపాడని చెబుతున్నారు. మరి.. రంజీ ట్రోఫీ ఫైనల్​కు రోహిత్ విచ్చేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: యంగ్ క్రికెటర్​కు సారీ చెప్పిన రింకూ.. కావాలని చేయలేదంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి