iDreamPost

ఆ కారణాలతో నా కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చింది: రానా

  • Author Soma Sekhar Published - 09:54 PM, Tue - 7 November 23

కొన్ని కారణాల వల్ల తన అద్భుతమైన కంపెనీని అమ్ముకున్నానని చెప్పుకొచ్చారు టాలీవుడ్ విలక్షణ నటుడు దగ్గుబాటి రానా. తన 18వ ఏటనే ఈ సంస్థను స్థాపించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

కొన్ని కారణాల వల్ల తన అద్భుతమైన కంపెనీని అమ్ముకున్నానని చెప్పుకొచ్చారు టాలీవుడ్ విలక్షణ నటుడు దగ్గుబాటి రానా. తన 18వ ఏటనే ఈ సంస్థను స్థాపించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

  • Author Soma Sekhar Published - 09:54 PM, Tue - 7 November 23
ఆ కారణాలతో నా కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చింది: రానా

ఇండస్ట్రీలోని నటీ, నటులు ఓ వైపు తమ కెరీర్ ను కొనసాగిస్తూనే ఇతర రంగాల్లో పెట్టుబడుతు పెడుతూ ఉంటారు. ఇక మరికొందరైతే సొంతంగా కొన్ని సంస్థలను స్థాపించి వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మరికొందరు మాత్రం వాటిని కొన్ని అనివార్య కారణాల వల్ల అమ్ముకోవాల్సి వస్తుంది. అలా కొన్ని కారణాల వల్ల తన అద్భుతమైన కంపెనీని అమ్ముకున్నానని చెప్పుకొచ్చారు టాలీవుడ్ విలక్షణ నటుడు దగ్గుబాటి రానా. తన 18వ ఏటనే ఈ సంస్థను స్థాపించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు రానా. ఇక ఆ కంపెనీలో తన సినిమాను తీయాలన్న కోరిక అలాగే మిగిలిపోయిందని తెలిపాడు. మరి ఇంతకీ ఆ రానా అమ్మిన కంపెనీ ఏది? దాని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రానా దగ్గుబాటి.. టాలీవుడ్ లో హీరోగా విలన్ గా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల్లో నటిస్తు సత్తా చాటుతున్నాడు. తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన రానా.. గతంలో తాను స్థాపించిన ఓ కంపెనీని కొన్ని కారణాల వల్ల అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. రానా మాట్లాడుతూ..”2005లో నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడే స్పిరిట్ మీడియా అనే విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను స్థాపించాను. 5 సంవత్సరాలు అందులో పని చేశాను. ఇక ఎప్పటికైనా ఆ స్టూడియో ద్వారా సినిమా తీయాలని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. సమయం గడుస్తున్న కొద్ది స్టూడియో నిర్వాహణ కష్టమైంది. దాంతో ఆ కంపెనీని మూసివేశాను. దానిని విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ అయిన ప్రైమ్ ఫోకస్ కి అమ్మేశాను. అదిప్పుడు వరల్డ్ లోనే అతి పెద్ద విజువల్ ఎఫెక్ట్ కంపెనీగా అవతరించింది” అని చెప్పుకొచ్చాడు రానా.

అయితే తన కంపెనీని అమ్మకానికి పెట్టినప్పుడు బాధపడలేదని తెలిపాడు బాహుబలి విలన్. వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో తెలీనప్పుడు దాని నుంచి తప్పుకోవడమే ఉత్తమ మార్గం అని వివరించాడు రానా. కాగా.. రానా విక్రయించిన స్పిరిట్ మీడియా ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 AD’ సినిమాకు అంతర్జాతీయ మార్కెట్ భాగస్వామిగా ఉంది. ఇదిలా ఉండగా రానా ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తలైవర్ 170 మూవీలో నటిస్తున్నాడు. దీనితో పాటుగా మరికొన్ని సినిమాల్లో నటిస్తు బిజీగా ఉన్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి