iDreamPost

అయోధ్యకు బ్యాంకుల క్యూ.. సరైన టైంలో భలే స్కెచ్‌!

  • Published Jan 18, 2024 | 10:41 PMUpdated Jan 18, 2024 | 10:41 PM

దేశమంతా ఇప్పుడు అయ్యోద్య వైపే చూస్తున్నారు.. జనవరి 22న అయ్యోధ్యలో రామ మందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు.

దేశమంతా ఇప్పుడు అయ్యోద్య వైపే చూస్తున్నారు.. జనవరి 22న అయ్యోధ్యలో రామ మందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు.

  • Published Jan 18, 2024 | 10:41 PMUpdated Jan 18, 2024 | 10:41 PM
అయోధ్యకు బ్యాంకుల క్యూ.. సరైన టైంలో భలే స్కెచ్‌!

దేశమంతా ఇప్పుడు ఎక్కడ చూసినా రామ నామమే జపిస్తున్నారు. అందరి చూపు అయోధ్య వైపే.. భారత దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతుంది. ఐదు శతాబ్దాల తర్వాత అయోధ్య నగరం కొత్త శోభను సంతరించుకోబోతుంది. రామ‌జన్మ భూమిలో ఆలయ నిర్మాణం వడి వడిగా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే బాలరాముడి విగ్రహ ప్రతిష్టించేందుకు పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. అయ్యోధ్య నగరంలో చారిత్రక వైభవం, సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాలు చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఇప్పుడు అయోధ్యపై ప్రైవేట్ బ్యాంకులు ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే అక్కడ వ్యాపార కార్యాకలాపాలు ప్రారంభం అయ్యాయి. వివరాల్లోకి వెళితే..

భారత ప్రభుత్వం అయ్యోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం ఏర్పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి జనం తరలి రానున్నారు. భవిష్యత్ లో ఇక్కడ పర్యాటక కేంద్రం విరాజిల్లుతుందని.. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అయ్యోధ్య పరిసన ప్రాంతాలకు వెళ్లి నివసించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే పలు కమర్షియల్ బ్యాంకులు అయోధ్యలో తమ కార్యాకలాపాలు విస్తరించేందుకు అక్కడికి క్యూ కడుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ నుంచి కర్ణాటక బ్యాంకు వరకు దాదాపు అన్ని ప్రైవేట్ బ్యాంకులు తమ శాఖలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. త్వరలో ఇక్కడికి వేల సంఖ్యలో జనం రాబోతున్నారు.. ఇదే సరైన సమయం అని సూపర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.

దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఇప్పటికే అయోధ్యలో మూడు బ్రాంచ్ లు ఉన్నాయి. మార్చి చివరికి మరో కొత్త బ్రాంచ్ తెరిచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే కర్ణాటక బ్యాంక్ తన 915 శాఖను అయోధ్యలో ప్రారంభించింది. ఇదే బాటలో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ లు వాటి సేవలతో పాటు ఏటీఎంలు పెద్ద ఎత్తున తీసుకువచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయోధ్య జిల్లాలో మొత్తం 250 బ్యాంక్ బ్రాంచులు ఉన్నాయి. బ్యాక్ ఆఫ్ బరోడాకు ఎక్కువగా అంటే దాదాపు 34 బ్రాంచ్ లు ఉన్నాయి. ఎస్ బీఐ కి 26 బ్రాంచ్ లు ఉన్నాయి. అయోధ్యలో ఆలయం ప్రారంభం అయిన తర్వాత పర్యాటకుల తాకిడి ఎక్కువ అవుతుందని.. ముందుగానే తమ వ్యాపారాలు ఊపందుకునే బ్యాంకులు భారీ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి