iDreamPost

OTT క్యూ కడుతున్న డిజాస్టర్లు

గత ఆగస్ట్ లో స్ట్రైక్ అయ్యాక జరుగుతున్న అగ్రిమెంట్లకు ఇది వర్తిస్తుందని చెప్పారు. కానీ ఎవరు ముందు ఒప్పందాలు చేసుకున్నారో ఎవరు చేసుకోలేదో తెలియదు కానీ మరోవైపు డిజాస్టర్లు చాలా తక్కువ గ్యాప్ తో ఓటిటి క్యూ కట్టేస్తున్నాయి.

గత ఆగస్ట్ లో స్ట్రైక్ అయ్యాక జరుగుతున్న అగ్రిమెంట్లకు ఇది వర్తిస్తుందని చెప్పారు. కానీ ఎవరు ముందు ఒప్పందాలు చేసుకున్నారో ఎవరు చేసుకోలేదో తెలియదు కానీ మరోవైపు డిజాస్టర్లు చాలా తక్కువ గ్యాప్ తో ఓటిటి క్యూ కట్టేస్తున్నాయి.

OTT క్యూ కడుతున్న డిజాస్టర్లు

ఆ మధ్య నిర్మాతల మండలి ఇకపై ఏ సినిమా అయినా సరే థియేటర్ కు ఓటిటికి కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉంటుందని కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత ఆగస్ట్ లో స్ట్రైక్ అయ్యాక జరుగుతున్న అగ్రిమెంట్లకు ఇది వర్తిస్తుందని చెప్పారు. కానీ ఎవరు ముందు ఒప్పందాలు చేసుకున్నారో ఎవరు చేసుకోలేదో తెలియదు కానీ మరోవైపు డిజాస్టర్లు చాలా తక్కువ గ్యాప్ తో ఓటిటి క్యూ కట్టేస్తున్నాయి. ఈ నెల 3న విడుదలైన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కేవలం మూడు వారాలకే 23వ తేదీ ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. పట్టుమని వారం దాటకుండానే హాళ్ల నుంచి మాయమైన ఎపిక్ డిజాస్టర్ ఇది. పవన్ కళ్యాణ్ ఫోటోతో గట్టెక్కుదామని బొక్క బోర్లా పడ్డారు

జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనుదీప్ రచనలో ఇంత నాసిరకం బొమ్మను ఎక్స్ పెక్ట్ చేయలేదని నెటిజెన్లు ఓపెన్ గానే విమర్శించారు. ఇద్దరు కొత్త దర్శకులు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇక మాస్ మహారాజా రవితేజ సూపర్ డూపర్ ఫ్లాప్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రేపే సోనీ లివ్ లో రానుంది. దీనికి మాత్రం కొంత ఎక్కువ టైం దొరికింది. ఖిలాడీ తర్వాత తను అందుకున్న మరో ఘోరమైన ఫ్లాప్ ఇది. నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సైతం వచ్చే వారం ప్రైమ్ లో రావొచ్చని ఓటిటి టాక్. ఇప్పటికే లేట్ అయ్యింది. మొన్న తొమ్మిదో తారీఖే స్ట్రీమింగ్ అన్నారు కానీ ఎందుకనో మళ్ళీ డేట్ మారినట్టు కనిపిస్తోంది. ఇదెప్పుడు వచ్చినా ఒకటే.

ఇలా బాక్సాఫీసు వద్ద తుస్సుమన్న సినిమాలు చాలానే ఓటిటి రావాల్సి ఉంది. సీతారామం లాంటి బ్లాక్ బస్టరే ముప్పై అయిదు రోజులకు డిజిటల్ లో వచ్చేసినప్పుడు వేరేవి ఆగి ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదు. ఈ లెక్కన ఎనిమిది వారాల నిడివి ప్రాక్టికల్ గా చూస్తే ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అసలే ఓటిటిలు చిత్ర విచిత్రమైన కండీషన్లతో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ కారణంగానే వర్కౌట్ కాదని తెలిసినా కొన్ని బడ్జెట్ మూవీస్ బలవంతంగా థియేట్రికల్ రిలీజ్ చేయాల్సి వస్తోంది. మరికొన్ని రెవిన్యూ షేరింగ్ మోడల్ కు ఒప్పుకుని నష్టాలపాలు కావాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో ఓటిటి పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారేలా ఉన్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి