iDreamPost

Rama Rao On Duty : మాస్ మహారాజా టైమింగ్ బాగుంది

Rama Rao On Duty : మాస్ మహారాజా టైమింగ్ బాగుంది

ఇటీవలే ఖిలాడీ రూపంలో భారీ డిజాస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ విడుదల తేదీని లాక్ చేసుకుంది. జూన్ 17 రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గతంలో మార్చి లేదా ఏప్రిల్ అన్నారు కానీ విపరీతమైన పోటీ మధ్య నలిగిపోవడం కంటే సోలో రావడం బెటరనే ఉద్దేశంతో మార్చేసుకున్నారు. ఇది సేఫ్ గేమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ డేట్ కి పెద్దగా నోటెడ్ రిలీజులు ఏమి లేవు. వారం ముందు నాని అంటే సుందరానికి తప్ప ఇంకేవి షెడ్యూల్ చేయలేదు. ఒకవేళ ఏదైనా వచ్చినా చిన్నదో మీడియం బడ్జెట్ దో ఉంటుంది కానీ మరీ రవితేజ రేంజ్ ది అయితే వచ్చే సూచనలు లేవు.

శరత్ మండవ దర్శకత్వం వహించిన రామారావులో రవితేజ ప్రభుత్వాధికారిగా నటిస్తున్నారు. టీజర్ చూశాక ఇది కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ లో సాగినట్టే కనిపించింది కానీ సరైన రీతిలో ఎనర్జీని వాడుకుంటే క్రాక్ తరహాలో మరో సూపర్ హిట్ కొట్టొచ్చు. గత కొన్నేళ్లుగా రవితేజకు ఒక హిట్టు వస్తే ఆపై వరసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. ఫాలోయింగ్ పుణ్యమాని బిజినెస్ జరిగిపోతోంది కానీ సక్సెస్ పరంగా కంటిన్యుటి ఉంటే తప్ప రాబడులు స్థిరంగా ఉండవు. అందుకే రామారావు ఆన్ డ్యూటీ హిట్ కావడం చాలా అవసరం. మొదటిసారి సామ్ సిఎస్ రవితేజ సినిమాకు సంగీతం సమకూర్చారు. దివ్యంష, రజీషా హీరోయిన్లుగా నటించారు.

అసలే ఇది ప్యాన్ ఇండియా కాలం. రీజనల్ చిత్రాలకు రిలీజ్ డేట్ సెట్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారింది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, బీస్ట్, ఆచార్య, సర్కారు వారి పాట లాంటి సినిమాలన్నీ కేవలం మూడు నెలల వ్యవధిలో రావడంతో రామారావు లాంటివి జూన్ నుంచి జులైకి మధ్య షిఫ్ట్ అయ్యాయి. ఎలాగూ మంచి టాక్ వస్తే చాలు జనం థియేటర్లకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు. దీని మీద మాస్ రాజా అభిమానులకు గట్టి అంచనాలే ఉన్నాయి. తర్వాత ధమాకా లాంటి ఎంటర్ టైనర్ కు దీని ఫలితం ప్లస్ అవుతుంది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, సుధీర్ వర్మ డైరెక్షన్ లో రావణాసుర అన్నీ కేవలం సంవత్సర కాలంలోనే వచ్చేస్తాయి. లెట్ సీ.

Also Read : Bheemla Nayak OTT : క్లాష్ అయ్యే టెన్షన్ తగ్గించుకున్న నాయక్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి