iDreamPost

Ram Gopal Varma: ‘హనుమాన్’ మూవీపై RGV రియాక్షన్! తొలిసారి ఇలా..

హనుమాన్ సినిమాపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో రివ్యూ ఇస్తాడని అందరూ ఊహించారు. కానీ తొలిసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ఆర్జీవీ.

హనుమాన్ సినిమాపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో రివ్యూ ఇస్తాడని అందరూ ఊహించారు. కానీ తొలిసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ఆర్జీవీ.

Ram Gopal Varma: ‘హనుమాన్’ మూవీపై RGV రియాక్షన్! తొలిసారి ఇలా..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన తొలి సూపర్ హీరో ఫిల్మ్ ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 12(శుక్రవారం)న విడుదలైన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రశాంత్ టేకింగ్ ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ మూవీ చూశాక అందరూ చెప్పే మాట ఒక్కటే.. ఇంత తక్కువ బడ్జెట్ లో అంత క్వాలిటీ అవుట్ పుట్ ను ఎలా తీసుకురాగలిగాడు.. అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే హనుమాన్ సినిమాపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో రివ్యూ ఇస్తాడని అందరూ ఊహించారు. కానీ తొలిసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ఆర్జీవీ.

హనుమాన్ మూవీ బ్లాక్ బాస్టర్ టాక్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలి సూపర్ హీరో ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ ను అద్భుతమైన విజయంతో ఆరంభించాడు. దీంతో హనుమాన్ మూవీ మేకర్స్ ను అభినందిస్తూ.. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వివాదాస్పద డైరెక్టర్ గా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ హనుమాన్ చిత్రంపై ట్వీట్ చేశారు. సాధారణంగా ఆర్జీవీ ఇచ్చే ప్రశంసల్లో ఇన్ డైరెక్ట్ గా కొన్ని సెటైర్లు ఉంటాయి. అదీకాక వర్మ స్టైల్ సెపరేట్. కానీ హనుమాన్ మూవీ విషయంలో మాత్రం ఇవేవీ ఫాలో అవ్వలేదు ఆర్జీవీ. సూటిన సినిమాపై తన రివ్యూ చెప్పాడు. “ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ ముందుగా మీకు నా అభినందనలు. హనుమాన్ మూవీ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.. జై హనుమాన్” అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనికి రిప్లై ఇస్తూ థ్యాంక్యూ సర్ అంటూ రాసుకొచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మరి ఆర్జీవీ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి