iDreamPost

కోహ్లీ బయోపిక్.. రామ్ చరణ్ అన్నదే జరగుతోందా..? వైరల్ అవుతున్న వీడియో!

  • Author ajaykrishna Updated - 10:52 AM, Wed - 6 September 23
  • Author ajaykrishna Updated - 10:52 AM, Wed - 6 September 23
కోహ్లీ బయోపిక్.. రామ్ చరణ్ అన్నదే జరగుతోందా..? వైరల్ అవుతున్న వీడియో!

జీవితంలో కొన్నిసార్లు మాటవరసకు అన్నవి కూడా నిజం అవుతుంటాయి. అవి కెరీర్ పరంగా కావచ్చు లేదా ఇంకా వేరే ఏ విషయంలోనైనా అయ్యుండొచ్చు. కానీ.. అప్పుడప్పుడు అవుతుంటాయని తెలుసు. అంటే.. మాటవరసకు అనేవి కూడా తాహత్తుకు మించినవి కాదు. ప్రస్తుతం ఉన్న స్టేజ్ లో మన వల్ల అవుతుందని అనిపించిన వాటిలో జరిగే అవకాశం ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో అలాంటిదే జరగబోతుందని తెలుస్తోంది. ఓ అవార్డు ఫంక్షన్ లో రామ్ చరణ్ అన్న మాటలు ఇప్పుడు నిజం కాబోతున్నాయని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి రామ్ చరణ్ ఇంతకీ ఏమన్నాడు? అనే వివరాల్లోకి వెళ్తే..

ఆ మధ్య రామ్ చరణ్ నేషనల్ న్యూస్ మీడియా సంస్థ ఎన్డిటీవీ తరపున అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అవార్డు తీసుకున్న అనంతరం రామ్ చరణ్ ని కెరీర్ లో ఎలాంటి రోల్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు? అని హోస్ట్ అడిగింది. అందుకు సమాధానంగా.. ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ సినిమా చేయాలనీ.. చాలకాలంగా ఆ కోరిక పెండింగ్ లో ఉందని చెప్పాడు చరణ్. వెంటనే అక్కడున్న హోస్ట్.. మీరు చూడటానికి విరాట్ కోహ్లీలా ఉంటారు.. ఆయన బయోపిక్ లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని అడిగారు. అందుకు స్పందించిన చరణ్.. “అవును.. అద్భుతమైన ఎంపిక. విరాట్ కోహ్లీ ఇన్స్పైరింగ్ పర్సన్స్ లో ఒకరు. సో.. ఆయన బయోపిక్ లో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను” అని తెలిపాడు.

కట్ చేస్తే.. ఇన్ని రోజులకు మళ్లీ ఆ టాపిక్ చర్చనీయంశంగా మారింది. ఎందుకంటే.. బాలీవుడ్ కి సంబంధించి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ.. విరాట్ కోహ్లీ బయోపిక్ తీయడానికి ప్రయత్నాలు చేస్తోందట. అందులో భాగంగా రామ్ చరణ్ కి కోహ్లీ బయోపిక్ స్టోరీ కూడా పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోనని చెప్పిన రామ్ చరణ్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ స్పోర్ట్స్ కోటాలో మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, ముత్తయ్య మురళీధరన్ బయోపిక్స్ సినిమాలు వచ్చేశాయి. సో.. ఇన్నాళ్లుగా ఇన్స్పైరింగ్ నిలుస్తున్న విరాట్ బయోపిక్ రావడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్. మరి చరణ్ ముందు చెప్పిందే ఇప్పుడు జరుగుతుందా అని అంటున్నారు నెటిజన్స్. మరి కోహ్లీ బయోపిక్ లో చరణ్ నటిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి