iDreamPost

Ram Charan : చరణ్ కైనా ఇది మళ్ళీ సాధ్యం కాదు

Ram Charan : చరణ్ కైనా ఇది మళ్ళీ సాధ్యం కాదు

ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే గగనమైపోయింది. మహేష్ బాబుని థియేటర్ లో చూసి రెండేళ్లు దాటేసింది. ఇంకో నాలుగు నెలలు వెయిటింగ్ తప్పదు. జూనియర్ ఎన్టీఆర్ దర్శనం జరిగి మూడున్నరేళ్లు. అల్లు అర్జున్ ఇరవై మూడు నెలల తర్వాత పుష్పతో దర్శనమిచ్చాడు. ప్రభాస్ గురించి చెప్పనక్కర్లేదు. సాహో ఎప్పుడు వచ్చిందో కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. కరోనా ఒకటే కారణం కాదు. షూటింగుల్లో ఆలస్యం, బడ్జెట్ పరిధులు దాటిపోవడం, బిజినెస్ ఇబ్బందులు, పాన్ ఇండియా లెక్కలు లాంటివి చాలానే ఉన్నాయి. ఏదైతేనేం అందరి విషయంలోనూ విపరీతమైన జాప్యాలు జరుగుతున్న మాట వాస్తవం

రామ్ చరణ్ కు సైతం ఈ పరిస్థితి తప్పలేదు. కానీ ఊహించని విధంగా వరస రిలీజులతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేయబోతుండటం మాత్రం విశేషమే. కేవలం 10 నెలల గ్యాప్ లో ఏకంగా 3 సినిమాలను ఇవ్వబోతున్నాడు మెగా పవర్ స్టార్. మొన్నేదో దిల్ రాజు చెప్పాడని కాదు కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఇది ఈజీగా సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. ముందుగా ఆచార్య ఏప్రిల్ 1 వస్తుంది. ఒకవేళ ఏదైనా మార్పు ఉన్నా మహా అయితే ఒక నెల రోజులు అటు ఇటు. అంతకు మించి లేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఆర్ఆర్ఆర్ మార్చి 18 రావడం కష్టమే కాబట్టి ఏప్రిల్ 28 పక్కా. అదీ కాలేదంటే జూన్ లో వచ్చే తీరాలి. వేరే ఆప్షన్ లేదు.

ఇక శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న భారీ చిత్రాన్ని 2023 సంక్రాంతికి లాక్ చేసేశారు. ముందుగానే చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకవేళ పోటీకి ఎవరైనా రావాలనుకున్నా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో. సో ఈ ఏప్రిల్ తో మొదలుపెడితే వచ్చే జనవరిలోగా మూడు సినిమాలు రావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అరుదైన ఘనతగానే చెప్పుకోవాలి. ఒకప్పుడు 80 మరియు 90 దశకం ప్రారంభంలో చిరంజీవి ఇలా ఏడాదికి రెండు మూడు రిలీజ్ చేయడం సాధ్యం చేశారు కానీ తర్వాత రాను రాను ఈ ఫీట్ అందరికీ కష్టమైపోయింది. మళ్ళీ రామ్ చరణ్ కైనా ఇలా చేయడం జరగని పనే. ఇప్పుడేదో అలా కలిసి వచ్చింది అంతే

Also Read : Jr NTR : యంగ్ టైగర్ ప్లానింగ్ మాములుగా లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి