iDreamPost

రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన తొలి హీరో ఎవరో మీకు తెలుసా?

  • Author Soma Sekhar Published - 01:03 PM, Mon - 19 June 23
  • Author Soma Sekhar Published - 01:03 PM, Mon - 19 June 23
రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన తొలి హీరో ఎవరో మీకు తెలుసా?

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించారు. అనారోగ్యం క్షీణించడంతో.. ఆదివారం సాయంత్రం 5 గంటలకు గాంధీ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. రక్త విరేచనాలు, వాంతులు కావడంతో మాస్టర్ ని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కానీ మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో ఆయన కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఆయన తొలి సినిమా ఏ హీరోతో చేశారు? కొరియోగ్రఫీ చేసిన తొలి పాట ఏంటి? అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. మరి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన తొలి హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

రాకేష్ మాస్టర్.. తిరుపతి ప్రాంతంలో జన్మించిన ఆయనకి డ్యాన్స్ అంటే ఎంతో పిచ్చి. దాంతో టీవీలో వచ్చే పాటలు చూసి డ్యాన్స్ నేర్చుకునే వారు. ఆ తర్వాత రూ.5 ఫీజుతో తిరుపతిలో ఓ డ్యాన్స్ స్కూల్ ను ప్రారంభించారు. అనంతరం సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు. అయితే అక్కడ అవకాశాలు రాకపోవడంతో.. మళ్లీ తిరుపతి వచ్చి డ్యాన్స్ స్కూల్ నడిపారు. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ ముక్కు రాజు మాస్టర్ దగ్గర శిష్యరికం చేశారు రాకేష్ మాస్టర్. ఆ తర్వాత ‘ఆట’, ‘ఢీ’ డ్యాన్స్ లాంటి రియాలిటీ షోల ద్వారా మాస్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు.

ఈ టైమ్ లోనే ఆ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రభుదేవాతో “తెలుగు తెలిసిన వాళ్లే తెలుగు డ్యాన్స్ షోలకు జడ్జిలుగా ఉండాలి” అంటూ సంచలన కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారారు. ఇక తన తొలి సినిమా ఛాన్స్ హీరో తొట్టెంపూడి వేణు సినిమాతో దక్కింది. వేణు హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘ చిరునవ్వుతో’ సినిమాలో ‘నిన్నలా మెున్నలా లేదురా’ పాటతో తన కెరీర్ ను ప్రారంభిచారు. ఆ తర్వాత రాకేష్ మాస్టర్ వెనుదిరిగి చూడలేదు. దేవదాసు, సీతారామరాజు,యువరాజు,గర్ల్ ఫ్రెండ్, బడ్జెట్ పద్మనాభం లాంటి దాదాపు 1500 చిత్రాలకు పైగా కొరియోగ్రఫీ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి