iDreamPost

జూన్ 19న చంద్రబాబుకు అసలైన పరీక్ష: టిడిపి ఎమ్మెల్యేలు ఎంత మంది ఊడుతారో..ఎంత మంది‌ ఉంటారో..?

జూన్ 19న చంద్రబాబుకు అసలైన పరీక్ష: టిడిపి ఎమ్మెల్యేలు ఎంత మంది ఊడుతారో..ఎంత మంది‌ ఉంటారో..?

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు వైఖరి‌ వల్లనే ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. ఆ పార్టీలో నేతలు ఉండేందుకు ఇష్ట పడటం లేదు. ఇప్పటికే వివిధ నేతలు టిడిపికి రాజీనామ చేసి వైసిపి, బిజెపి పార్టీల్లో చేరారు. కొంత మందిని చంద్రబాబే బిజెపిలో పంపించాడు. వారి ద్వారా తనకు నష్టం జరగకుండా చూసుకుంటున్నాడు. అలాగే ఆయనపై ఉన్న ఓటుకు నోటు కేసుతో పాటు ఆయనపై వచ్చిన అనేక ఆరోపణలను బిజెపిలోకి పంపించిన తన అనుయాయుల చేత బయటకు రానియకుండా చేస్తున్నాడు. అయితే బిజెపిలో చేరిన చంద్రబాబు ‌అనుయాయ వర్గం ఆటలు అక్కడ పెద్దగా సాగట్లేదు. కాని తప్పనిసరి పరిస్థితుల్లో తమ అధినేత ప్రయోజనం కోసం వారు బిజెపిలో ఉన్నారు.

ఇకపోతే రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో టిడిపికి పట్టుకొమ్మాల్లా ఉన్న కార్యకర్తలు కూడా ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. చాలా మంది కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు వైఖరి వల్లనే వారంతా టిడిపికి‌ దూరంగా ఉన్నారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా నేతల మధ్య సఖ్యత లేదు. చాలా మంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. అందులో భాగంగానే ఇటీవలి స్థానిక‌ సంస్థల‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక చాలా స్థానాల్లో అనాముకుల్ని అభ్యర్థులుగా పోటీలో పెట్టారు. అదే టిడిపి అధికారంలో ఉంటే టిడిపి నేతలే తమ కుటుంబాలకు చెందిన వారిని రంగంలో దింపేవారు. కాని టిడిపి పరిస్థితి కుడుతులో పడిన ఎలకలా మారిన నేపథ్యంలో వారంతా పోటీకి దూరంగా ఉన్నారు.

ఇక మిగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలు. వీరిలో ఎంపిలకు సంబంధించి ఒకరు విజయవాడ ఎంపి కేశినేని నాని బిజెపిలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే కొన్ని రోజుల‌ తరువాత అది సద్దుమణిగింది. ఇక ఎమ్మెల్యేల సంగతికి వచ్చేసరికి 23 ముగ్గురులో చాలా మంది చంద్రబాబు తీరుపై అసంతృప్తిగా ‌ఉన్నారు. ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, మద్దాలి గిరిధర్‌ రావు‌ వంటి ఎమ్మెల్యేలు చంద్రబాబును బహిరంగంగానే విమర్శిస్తున్నారు. విశాఖ టిడిపి గంట శ్రీనివాసరావు లాంటోళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

వైసిపి అధినేత, సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‌నిబద్ధత, చెప్పిన మాటకు కట్టుబడి ఉండే లక్షణం వంటి వాటి వల్లే టిడిపి బతుకుతుందని‌ చెప్పాలి. ఎందుకంటే వైఎస్ జగన్ ఆహ్వానిస్తే పార్టీ చేరడానికి అనేక మంది ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలో చేరాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే షరతు‌ సిఎం జగన్ పెట్టారు. అందువల్లనే చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఈ షరతు కూడా జగన్ ఎందుకు పెట్టారంటే…రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందువల్లనే టిడిపి ఆ ఎమ్మెల్యేలు మిగిలారు.

అయితే రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ నాలుగు స్థానాలు వైసిపికే వస్తాయి. ఎందుకంటే ఎమ్మెల్యేల బలం ఆ రకంగా ఉంది. ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో అధికార వైసిపికి 151 మంది ఉన్నారు. ఆ బలాన్ని బట్టీ నాలుగు స్థానాలను వైసిపి సొంతం చేసుకుంటుంది. కాని టిడిపికి కనీస ఎమ్మెల్యేలు కూడా లేరు.‌ అయినప్పటికీ చంద్రబాబు టిడిపి తరపున పోటీలో పెట్టారు. ఇది కావాలనే చేశారు. టిడిపి నుంచి బరిలో లేకపోతే నాలుగు స్థానాలు ఏకగ్రీవం అవుతాయి. చాలా రాష్ట్రాల్లో ఏకగ్రీవమే అవుతున్నాయి. గత టిడిపి హయంలో కూడా రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అప్పుడు వైసిపి ఎక్కువ మందిని బరిలో దింపలేదు. ఆపార్టీకి ఉండే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టీ పోటీ చేసింది. అందువల్ల ఏకగ్రీవం అయ్యేవి. అయితే ఇప్పుడు టిడిపికి బలం లేకున్నా పోటీలో పెట్టింది. దీంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

అయితే ఈ ఎన్నికలే చంద్రబాబుకు అగ్ని పరీక్ష పెట్టాయి. ఎంత మంది ఎమ్మెల్యేలు టిడిపిలో ఉంటారో…ఎంత మంది ఎమ్మెల్యేలు టిడిపికి దూరంగా ఉంటారో స్పష్టం అయిపోతుంది. దీంతో టిడిపి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ అగ్ని పరీక్షను ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబుకు అర్థం కావటం లేదు. చంద్రబాబుకు జూన్ 19 జరిగే రాజ్యసభ ఎన్నికలు అగ్ని పరీక్షను పెట్టనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి