iDreamPost

Rajinikanth: చడీ చప్పుడు లేకుండా విడుదలవుతోన్న రజనీకాంత్‌ సినిమా.. ఏదంటే!

  • Published Feb 07, 2024 | 12:46 PMUpdated Feb 07, 2024 | 12:46 PM

రజనీకాంత్‌ సినిమా విడుదల అంటే హడావుడి మాములుగా ఉంది. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా రజనీ సినిమా ఒకటి సైలెంట్‌గా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

రజనీకాంత్‌ సినిమా విడుదల అంటే హడావుడి మాములుగా ఉంది. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా రజనీ సినిమా ఒకటి సైలెంట్‌గా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

  • Published Feb 07, 2024 | 12:46 PMUpdated Feb 07, 2024 | 12:46 PM
Rajinikanth: చడీ చప్పుడు లేకుండా విడుదలవుతోన్న రజనీకాంత్‌ సినిమా.. ఏదంటే!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు కేవలం మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే అభిమానులు చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇక తమిళనాడులో రజనీ సినిమా విడుదల సందర్భంగా కొన్ని కంపెనీలు సెలవు కూడా ప్రకటిస్తాయి అంటే.. ఆయన రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలు రజనీకాంత్‌ సినిమా వస్తుందంటేనే.. ఓ నెల రోజుల ముందు నుంచి ప్రమోషన్స్‌ మొదలవుతాయి. ఇంటర్వ్యూలు, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వంటి కార్యక్రమాలతో సినిమాపై బజ్ మొదలవుతుంది. కానీ తొలిసారి అందుకు భిన్నంగా.. రజనీకాంత్‌ నటించిన ఓ సినిమా ఎలాంటి ప్రచారం లేకుండా.. సైలెంట్‌గా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇంతకు ఆ సినిమా ఏది అంటే..

జైలర్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత రజనీకాంత్‌ నటించిన సినిమా లాల్‌ సలాం. అయితే సూపర్‌స్టార్‌ నటించిన ఈ సినిమాకు సంబందించి ఇప్పటి వరకు ఎలాంటి బజ్‌ కానీ, ప్రచారం కానీ మొదలు కాలేదు. అసలు ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్‌ అవుతుందన్న సంగతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రజనీ అభిమానులకు తెలియదు. సూపర్‌స్టార్‌ సినిమా ఇలా సైలెంట్‌గా విడుదల కావడం ఇదే మొదటి సారి అంటున్నారు సినీ పండితులు.

rajni movie release silently

రజనీకాంత్‌ నటించిన లాల్‌ సలామ్‌ చిత్రం ఫిబ్రవరి 9, శుక్రవారం నాడు విడుదల కానుంది. సినిమా రిలీజ్‌కు ఇంకా కనీసం 48 గంటల సమయం కూడా లేదు.. ఇప్పటి వరకు తెలుగు ట్రైరల్‌ విడుదల కాలేదు. తమిళ్‌ ట్రైలర్‌ మాత్రం 24 గంటల క్రితం అనగా మంగళవారం నాడు రిలీజ్‌ చేశారు. ఇక తెలుగు ట్రైలర్‌ ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది అనే దాని పై క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాకు రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్యనే దర్శకురాలు.

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా నగరాల్లో మల్టీప్లెక్స్ స్క్రీన్లలో లాల్‌ సలామ్‌ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కాలేదు. ప్రస్తుతానికి ఒక్క థియేటర్, అదీ కూడా క్రాస్ రోడ్స్ సప్తగిరిలో అడ్వాన్స్‌ బుకింగ్స్ ఓపెన్ చేశారు. రజనీకాంత్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం ఆశ్చర్యకరంగా ఉంది అంటున్నారు సినీ పండితులు.

ఆ విషయం అలా ఉంచితే ఇక ఈ వారంలో వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ గురువారం ఫిబ్రవరి 7న విడుదల అవుతుండగా.. శుక్రవారం, ఫిబ్రవరి 8న మాస్ మహారాజా రవితేజ ‘ఈగల్’ విడుదల అవుతున్నాయి. ఆ తర్వాత రోజు ‘ట్రూ లవర్’ (తమిళ డబ్బింగ్) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ మూడు సినిమాలకు ఒక స్థాయిలో ప్రచారం జరుగుతోంది. కానీ రజనీకాంత్ సినిమా లాల్‌ సలామ్‌ మాత్రం సైలెంట్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి