iDreamPost

బీజేపీ మేనిఫెస్టో: ఇంటర్ పూర్తయిన యువతులకు స్కూటీలు.. వారందరికి రూ.లక్ష

  • Published Nov 17, 2023 | 11:45 AMUpdated Nov 17, 2023 | 11:45 AM

ఎన్నికల వేళ పార్టీల మేనిఫెస్టోలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. ప్రజలను ఆకర్షించడానికి రకరకాల హామీలిస్తారు. తాజాగా బీజేపీ మేనిఫెస్టోలో యువత మీద వరాల జల్లు కురిపించింది. ఆ వివరాలు

ఎన్నికల వేళ పార్టీల మేనిఫెస్టోలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. ప్రజలను ఆకర్షించడానికి రకరకాల హామీలిస్తారు. తాజాగా బీజేపీ మేనిఫెస్టోలో యువత మీద వరాల జల్లు కురిపించింది. ఆ వివరాలు

  • Published Nov 17, 2023 | 11:45 AMUpdated Nov 17, 2023 | 11:45 AM
బీజేపీ మేనిఫెస్టో: ఇంటర్ పూర్తయిన యువతులకు స్కూటీలు.. వారందరికి రూ.లక్ష

ప్రస్తుతం తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఇవి సెమిఫైనల్స్‌ వంటివి. అందుకే ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రధాన పార్టీలన్ని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వారిపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. తమను గెలిపిస్తే ఏమేం పథకాలు అమలు చేస్తామో వివరిస్తూ.. ప్రజాకర్షక​ మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. పార్టీలన్ని ఒకదానితో ఒకటి పోటీ పడుతూ.. ఒకరికి మించి మరొకరు సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. యువతను టార్గెట్‌ చేస్తూ.. వారిని ఆకర్షించడం కోసం ఏకంగా స్కూటీలు, నగదు సాయం వంటి హామీలిచ్చింది. ఆవివరాలు..

ప్రసుత్తం దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ కూడా ఉంది. ఈ క్రమంలో బీజేపీ తాజాగా మేనిఫెస్టోని విడుదల చేసింది. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసింది. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆడవారి మీద వరాల జల్లులు కురిపించింది. బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా జైపూర్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. లాడో ప్రోత్సాహన్ యోజన కింద ప్రతి ఆడపిల్ల పేరు మీద రూ.2 లక్షల పొదుపు బాండ్ చేస్తామని ప్రకటించారు.

చదువుకునే బాలికలకు ఆర్థికసాయాన్ని కూడా ప్రకటించింది. దీనిలో భాగంగా 6-8వతరగతి బాలికలకు ఏడాదికి రూ.6 వేలు.. 9 వ తరగతి బాలికలకు రూ. 8 వేలు.. 10 వ తరగతిలో రూ.10 వేలు ఇవ్వనున్నుట్ల ప్రకటించింది. అలానే ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌లో రూ.12 వేలు, సెకండ్ ఇయర్‌లో రూ.14 వేలు.. డిగ్రీ చేస్తున్న యువతులకు రూ. 50 వేలు అందిస్తామని వెల్లడించారు. అలానే 21 ఏళ్లు పూర్తి చేసుకున్న యువతులకు రూ.లక్ష సాయం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో వెల్లడించింది.

ఇక ప్రతిభావంతులైన ఇంటర్ పూర్తి చేసుకున్న యువతులకు ఉచిత స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చింది. ‘లఖపతి దీదీ’ పథకం కింద 6 లక్షల మంది గ్రామీణ మహిళలకు శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొంది. మరోవైపు.. ఉజ్వల పథకం కింద రూ. 450కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పింది. ఇవే కాక.. మాతృ వందన్ యోజన కింద నగదు ప్రోత్సాహకం రూ.8 వేలకు పెంచుతామని.. విద్యార్థులు పుస్తకాలు, ఇతర సామాగ్రి కొనుగోలు చేసుకునేందుకు రూ.1200 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పుకొచ్చింది.

మెడికల్ రంగాన్ని మెరుగుపరిచేందుకు రూ.40 వేల కోట్లు కేటాయిస్తామని.. 15 వేల మంది వైద్యులు.. 20 వేల మంది పారామెడికల్ సిబ్బందిని నియమిస్తామని వెల్లడించింది. ఆరావళి శ్రేణులను రక్షించడానికి గ్రీన్ కారిడార్, ఎడారీకరణను నిరోధించడానికి రూ.50 కోట్లతో థార్ కన్జర్వేషన్ మిషన్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. బీజేపీ ప్రకటించిన హామీలపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి