iDreamPost

పెళ్లింట తీవ్ర విషాదం.. 9 మంది దుర్మణం!

Rajasthan Accident: పెళ్లి వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి.. హ్యాపీగా గడిపిన పెళ్లి బృందం తిరిగి వ్యాన్ లో తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు. అంతలోనే ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది.

Rajasthan Accident: పెళ్లి వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి.. హ్యాపీగా గడిపిన పెళ్లి బృందం తిరిగి వ్యాన్ లో తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు. అంతలోనే ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది.

పెళ్లింట తీవ్ర విషాదం.. 9 మంది దుర్మణం!

ఇటీవల దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది అనాథలుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తెస్తున్నా డ్రైలర్లు చేసే నిర్లక్ష్యం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని అధికారులు అంటున్నారు. అతివేగం, నిర్లక్ష్యం, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ఘోరాలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లో ఓ పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో తొమ్మిది మంది మరణించారు.   పెళ్లికి వచ్చిన అతిథులతో ఓ వ్యాన్ బయలుదేరింది. ఈ క్రమంలోనే ఆ వ్యాన్‌ను వేగంగా వచ్చిన ట్రాలీ ఢీకొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.  మారుతీ వ్యాన్ లో ఆ సమయంలో పది మంది ఉన్నట్లు తెలుస్తుంది.  ఈ ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందంటే.. వ్యాన్ రెండు ముక్కలయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  ఝలావర్ జిల్లాలో అక్లెరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం ప్రమాదం జరిగింది.

మధ్యప్రదేశ్‌లోని దుంగ్రీలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన అనంతరం దుగర్‌గావ్‌లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా ఎన్‌హెచ్ 52లోని పచోలా సమీపంలో మారుతీ వ్యాన్‌ను ట్రాలీ అతి వేగంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ధాటికి వ్యాన్ రెక్కలు ఊడి అవతలపడిపోయయి. సమాచారం తెలుసుకొని వెంటనే ఘటనా స్థలానికి చేరకొని గాయపడ్డ వారిని హాస్పిటల్ కి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో అశోక్ కుమార్, రోహిత్, హేమరాజ్, సోను, దీపక్, రవిశంకర్, రోహిత్, రామకృష్ణ, ప్రేమ్ చంద్ మరణించినట్లుగా పోలీసులు తెలిపారు. వీరి మృతదేహాలు పోస్ట్ మార్టం తరలించినట్లు పేర్కొన్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని ప్రాథమిక విచారణలో తెలిందని.. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి