iDreamPost

ట్విట్టర్ లో సరికొత్త ఎడ్ల బండి, నెటిజెన్లు ఫిదా

ట్విట్టర్ లో సరికొత్త ఎడ్ల బండి, నెటిజెన్లు ఫిదా

అలుపెరగక పని చేసే ఎద్దులతో బండ చాకిరీ చేయించుకోవడమే గానీ వాటి నొప్పిని అర్థం చేసుకునేవాళ్ళెంత మంది ఉంటారు? ఉన్నారు. మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని RITలో చదువుకునే కొందరు స్టూడెంట్స్ ఎడ్లకు భారం తగ్గించే విధంగా బండికి ముందు భాగంలో ఓ టైర్ అమర్చారు. ఇంటర్నెట్ లో ఇప్పుడీ ఫొటో సెన్సేషన్. అవనీష్ శరణ్ అనే IAS ఆఫీసర్ ఈ వినూత్నమైన ఫోటోను ట్విటర్ లో షేర్ చేశారు. “ఎడ్లకు శ్రమకు తగ్గించేవిధంగా రోలింగ్ స్పోర్ట్ (rolling sport) అమర్చబడిన ఎడ్ల బండి” అంటూ ఓ క్యాప్షన్ యాడ్ చేశారు. ఈ ఫొటోలో ఎండు గడ్డి మోసుకెళ్తున్న ఎడ్ల బండి, దాన్ని లాగుతున్న రెండు ఎడ్లు, వాటి మధ్యనున్న కాడికి అమర్చిన రోలింగ్ టైర్ కనిపిస్తాయి. ఈ టైర్ వల్ల ఎడ్లు ఎంత బరువునైనా అవలీలగా లాగేస్తాయని అవనీష్ శరణ్ చెబుతున్నారు.


ఎడ్ల బండ్లను ఎన్నోసార్లు చూసిన నెటిజన్లను ఈ ఫొటో విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఇది నిముషాల్లో వైరల్ అయిపోయింది. చాలా మంది యూజర్లు ఈ సరికొత్త ఆవిష్కరణను పొగుడుతూ ట్వీట్ చేశారు. విదేశీ యంత్రాలు కొనుక్కునే బదులు, మనమే ఇలాంటివి తయారు చేసుకోవడం గొప్ప విషయమని కొందరు యూజర్లు పొగడ్తలు కురిపించారు. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి దీని సృష్టికర్తలను ఐన్ స్టీన్ తో పోల్చారు. మొత్తమ్మీద ఈ వైరల్ ఫోటో వేల కొద్ది లైకులు సంపాదించుకొంటోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి