iDreamPost

కల్కి టీజర్ చూసి రాజమౌళికి ఊహించని డౌట్! ట్వీట్ వైరల్!

  • Author ajaykrishna Published - 08:28 AM, Sat - 22 July 23
  • Author ajaykrishna Published - 08:28 AM, Sat - 22 July 23
కల్కి టీజర్ చూసి రాజమౌళికి ఊహించని డౌట్! ట్వీట్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి'(Kalki 2898 AD). పాన్ వరల్డ్ మూవీగా అత్యధిక భాషలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి.. తాజాగా టైటిల్, గ్లింప్స్ వచ్చేశాయి. ఇన్ని రోజులు ప్రాజెక్ట్ కే పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమా.. కల్కి అని అధికారికంగా ప్రకటించే సరికి ఫ్యాన్స్ అందరు ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఫ్యాన్స్, ఆడియన్స్ ఆనందాన్ని డబుల్ చేస్తూ.. విజువల్ వండర్ గా కల్కి గ్లింప్స్ ని ప్రెజెంట్ చేశారు మేకర్స్. దీంతో వరల్డ్ వైడ్ సినీ ఫ్యాన్స్ అంతా కల్కి గ్లింప్స్ పై, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ కూడా కల్కి రోల్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు వైజయంతి ప్రొడక్షన్స్ వారు. కాగా.. కల్కి గ్లింప్స్ ని అమెరికాలోని శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే కల్కి అనే టైటిల్ తో గ్లింప్స్ రిలీజ్ అయ్యిందో.. అప్పటినుండి ఈ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. అభిమానులతో పాటు ఎంతోమంది సినీ ప్రముఖులు కల్కి గురించి మాట్లాడుతూ విష్ చేశారు. ఈ క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి సైతం కల్కి గ్లింప్స్ పై స్పందించాడు. కల్కి పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ కూడా చేశాడు. కానీ.. రాజమౌళి చేసిన ట్వీట్ తో ఆయన అభిమానులు ఓ ఆటాడుకుంటున్నారు.

“గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. ఒక ప్రామాణికమైన భవిష్యత్తు చిత్రాన్ని రూపొందించడం చాలా కష్టం. దాన్ని మీరు చేసి చూపించారు. డార్లింగ్ ప్రభాస్ లుక్ అదిరిపోయింది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలి ఉంది. రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు” అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి. ఆయన ట్వీట్ పై బాహుబలి ప్రొడ్యూసర్ శోభయార్లగడ్డ ఫన్నీగా రియాక్ట్ అవుతూ.. “రిలీజ్ డేట్ గురించి ఎవరు అడుగుతున్నారు చూడండి” అని కౌంటర్ వేశాడు. దీంతో అభిమానులు సైతం రిలీజ్ డేట్ గురించి మీరు అడుగుతున్నారా జక్కన్న? అస్సలు బాగోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. రాజమౌళి తదుపరి సినిమాను మహేష్ బాబుతో రూపొందించనున్న సంగతి తెలిసిందే. మరి కల్కి గ్లింప్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి