iDreamPost

రాజమౌళి మంచి మనసు.. రోడ్‌ వైడెనింగ్‌లో కొట్టేస్తున్న చెట్లను..

రాజమౌళి మంచి మనసు.. రోడ్‌ వైడెనింగ్‌లో కొట్టేస్తున్న చెట్లను..

దేశం గర్వించదగ్గ దర్శకుల్లో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఆయన కేవలం తెలుగు సినిమానే కాదు.. ఇండియన్‌ సినిమాను కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. రాజమౌళికి సినిమాలంటే మాత్రమే కాదు.. ప్రకృతి అన్నా కూడా ఎంతో ఇష్టం. అందుకే నల్గొండలోని తన ఫామ్‌ హౌస్‌లో అన్ని రకాల మొక్కలు, చెట్లు పెంచుకుంటూ ఉన్నారు. ఆయన పర్యావరణం విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. తన అవసరం ఉందనుకున్నపుడు వీలైనంత సహాయం చేస్తూ ఉంటారు.

తాజాగా, మరోసారి ఆయన తనకు ప్రకృతిపై ఉన్న ప్రేమను బయట పెట్టారు. ఏకంగా 20 చెట్లను దత్తత తీసుకున్నారు. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో రోడ్డు వైడెనింగ్‌ కోసం చెట్లు కొట్టేస్తారన్న సంగతి వాటా ఫౌండేషన్‌కు చెందిన ఉదయ్‌ క్రిష్ణ పెద్దిరెడ్డికి తెలిసింది. దీంతో ఆయన రాజమౌళికి విషయం చెప్పారు. వాటిని దత్తత తీసుకోమని కోరారు. రాజమౌళి సరేనన్నారు. ఆ తర్వాత వాటిని శంషాబాద్‌ నుంచి నల్గొండకు ట్రాన్స్‌లొకేట్‌ చేసే పనులు మొదలయ్యాయి.

దాన్ని వేర్లతో సహా కట్‌ చేసి లారీల్లో నల్గొండకు తరలించారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను మొత్తం రాజమౌళే పెట్టుకున్నారు. ఆ తర్వాత వాటిని తన ఫామ్‌ హౌస్‌లో నాటించారు. ఇక, రాజమౌళి చేసిన పనికి అన్ని వర్గాల నుంచి ప్రశంసల జల్లు వెల్లువెత్తుతోంది. కాగా, రాజమౌళి ప్రస్తుతం మహేష్‌బాబుతో కలిసి ప్యాన్‌ వరల్డ్‌ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ‘ఇండియానా జోన్స్‌’ తరహాలో ఉండబోతోందని తెలుస్తోంది. మరి, రాజమౌళి 20 మొక్కలను దత్తత తీసుకుని, ట్రాన్స్‌లొకేట్‌ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి