iDreamPost

Dunki Vs Salaar: రాజ్ కుమార్ హిరానీ vs ప్రశాంత్ నీల్! ఇద్దరిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్?

డిసెంబర్ క్రిస్మస్ రేసులో రెండు భారీ చిత్రాలు తలపడ్డాయి. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డంకీ, సలార్ మూవీస్.. గంటల వ్యవధిలో ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో ఈ చిత్రాలను తెరకెక్కించిన దర్శకులు హిరానీ,నీల్ లో ఎవరు బెస్ట్ అనే చర్చ సాగుతోంది. వారి ప్రత్యేకతలేంటో మీరే చూడండి.

డిసెంబర్ క్రిస్మస్ రేసులో రెండు భారీ చిత్రాలు తలపడ్డాయి. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డంకీ, సలార్ మూవీస్.. గంటల వ్యవధిలో ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో ఈ చిత్రాలను తెరకెక్కించిన దర్శకులు హిరానీ,నీల్ లో ఎవరు బెస్ట్ అనే చర్చ సాగుతోంది. వారి ప్రత్యేకతలేంటో మీరే చూడండి.

Dunki Vs Salaar: రాజ్ కుమార్ హిరానీ vs  ప్రశాంత్ నీల్! ఇద్దరిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్?

ఈ డిసెంబర్ ఎండింగ్ నిరుడు లెక్క ఉండదు. రెండు భారీ సినిమాలు డంకీ, సలార్-ది సీజ్ ఫైర్ బాక్సాఫీస్ షేక్ చేసేందుకు వచ్చేసాయి. డిసెంబర్ 21న డంకీ విడుదల అవ్వగా.. మరుసటి రోజు అంటే డిసెంబర్ 22న సలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ రెండు చిత్రాల ట్రైలర్స్, గ్లింప్స్, ప్రచార చిత్రాలు అంచనాలు మరింత పెంచేశాయి. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే రెండు చిత్రాలు విడుదల కావడంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంటుందన్న ఉత్కంఠ కూడా వీడింది. డంకీ యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. సలార్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో రెండు సినిమాల దర్శకుల గొప్పతనం గురించి కూడా చర్చించుకుంటున్నారు జనాలు.

ఇక ఈ చిత్రాల దర్శకుల విషయానికి వస్తే.. రాజ్ కుమార్ హిరానీ, ప్రశాంత్ నీల్.. ఇద్దరూ చేసినవి తక్కువ సినిమాలే అయినా.. తమ సత్తాను చాటుకున్నారు. ఇద్దరు ఇప్పటి వరకు ఓటమి ఎరుగని యోధులు. బాలీవుడ్ దర్శకుడు 2003లో హిరానీ మున్నాభాయ్ ఎంబీబీఎస్‌తో కెరీర్ స్టార్ చేశారు. లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు వంటి హిట్స్ అందించాడు. తాజాగా విడుదలైన డంకీ ఆయన ఆరోవ చిత్రం. 100 పర్సెంట్ సక్సెస్ రేటు ఉన్న రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకుంటున్నారు స్టార్స్. డైరెక్టర్‌గా ఆయనకు పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఆచితూచి సినిమాలు చేస్తుంటారు. ఆలోచనాత్మక మూవీస్ తీయడంలో దిట్ట.

ఇక ప్రశాంత్ సంగతి చూస్తే కేవలం మూడు చిత్రాలతోనే పాన్ ఇండియా పాపులారిటీ సంపాదించాడు. 2014లో ఉగ్రంతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత పాన్ ఇండియన్ మూవీస్ కేజీఎఫ్ సిరీస్‌లతో అందరి దృష్టి తన వైపు పడేలా చేశాడు. ఇక అతడు కూడా సెంట్ పర్సంట్ సక్సెస్ చూసిన కెప్టెన్. ఇప్పుడు నాల్గవ చిత్రంగా గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ తెరకెక్కించాడు. అలాగే వీరిద్దరి చిత్రాల ఐడీబీఎం యావరేజ్ ర్యాంక్ హిరానీకి 8.1 ఉంటే, ప్రశాంత్ మూవీస్‌కు 8.2 ఉంది. హిరానీకి హయ్యెస్ట్ ఐడీబీఎం ర్యాంక్ సాధించిన మూవీ ఏదంటే.. త్రీ ఇడియెట్. ఈ మూవీకి 8.4 ర్యాంక్ ఉంది. నీల్ కేజీఎఫ్ 2 8.3 హయ్యెస్ట్ ర్యాంక్ సాధించింది. వీరి చిత్రాల కలెక్షన్ల విషయానికి వస్తే..

హిరానీ, నీల్ ఇద్దరి మూవీస్ బాక్సాఫీసు వద్ద పైసా వసూల్ చేశాయి.. ఇప్పటి వరకు హిరానీ హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రం అమీర్ ఖాన్ మూవీ పీకే. వరల్డ్ వైడ్‌గా 769. 89 కోట్లను వసూలు చేసింది. ప్రశాంత్ విషయానికి వస్తే.. కేజీఎఫ్ 2 అత్యధిక కలెక్షన్లు కలెక్ట్ అయ్యాయి. ఈ పిక్చర్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1215 కోట్లను కొల్లగొట్టింది. ఇక ఈ ఇద్దరి మూవీస్ పట్ల ప్రజాదరణ ఎలా ఉందంటే.. వీరి సినిమాలు వస్తున్నాయంటే.. హిరానీ చిత్రాలకు 2.4 కోట్ల మంది ఆసక్తి చూపితే.. కేజీఎఫ్ డైరెక్టర్ మూవీస్ పట్ల 2.2 కోట్ల మంది ఇంట్రస్ట్ చూపుతున్నారట. ఓటమి ఎరుగుని ఇద్దరు యోధులు.. బాక్సాఫీసు వద్ద ఒక రోజు తేడాతో ఢీ కొన్నారు. ఇద్దరిలో ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో హిట్ కొట్టగా.. హిరానీ డంకీ చిత్రం యావరేజ్ టాక్ తో వెనకపడింది. మూవీ కలెక్షన్ల పరంగా కాకుండా టాలెంట్ పరంగా చూస్తే ఎవరికీ వారే సాటి అంటున్నారు అభిమానులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి