iDreamPost

రైల్వేలో ఈ స‌ర్వీసుల‌న్నీ ఫ్రీ!

రైల్వేలో ఈ స‌ర్వీసుల‌న్నీ ఫ్రీ!

మన రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద నెట్ వర్క్. ఇది దేశవ్యాప్తంగా 1.2 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దేశంలో ఎక్కడికైనా అతి తక్కువ ఖర్చుతో తీసుకెళ్ళేది ఒక్క రైలు మాత్రమే. అంతే కాదు ఇందులో ఎన్నో ఉచిత సేవలు కూడా ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. అవేంటో ఓసారి చూద్దాం.

ఉచితంగా క్లాస్ అప్​గ్రడేషన్ (Free Class Upgradation):
ట్రైన్ లో క్లాస్ అప్​గ్రడేషన్ ఫ్రీగా చేసుకోవచ్చు. అంటే స్లీపర్ క్లాస్ ప్రయాణికుడికి థర్డ్ ఏసీ, థర్డ్ ఏసీ ప్యాసెంజర్ కి సెకండ్ ఏసీ, సెకండ్ ఏసీ ప్రయాణికుడికి ఫస్ట్ ఏసీలో సీటు దొరుకుతుంది. అదీ టికెట్ ధరలో మార్పు లేకుండా! అయితే ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని పొందాలంటే టికెట్ బుకింగ్ సమయంలో auto upgrade అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందుబాటులో ఉన్న సీట్లను బట్టి రైల్వే సిబ్బంది టికెట్ ని అప్ గ్రేడ్ చేస్తారు. అయితే ప్రతిసారీ టికెట్ అప్ గ్రేడ్ అవుతుందనీ చెప్పలేము.

వికల్ప్ సర్వీస్ (Vikalp Service):
వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు వికల్ప్ సర్వీస్ వరం లాంటిది. ఒక ట్రెయిన్ లో వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు ఈ ఫ్రీ సర్వీస్ ద్వారా అదే రూట్లో వెళ్ళే మరో ట్రెయిన్ లో సీటు పొందవచ్చు.

ఉచితంగా టికెట్ బదిలీ (Transfer of tickets for free):
అనుకోని కారణాల వల్ల ఒక ప్రయాణికుడి ప్రయాణం క్యాన్సిల్ అయితే ఆ టికెట్ ని తన కుటుంబంలోని మరొకరికి బదిలీ చేయవచ్చు. కాకపోతే ప్రయాణానికి 24 గంటల ముందు వరకు మాత్రమే టికెట్ బదిలీకి అవకాశం ఉంటుంది. బదిలీ చేయాల్సిన టికెట్ ప్రింటవుట్ తీసుకుని దగ్గరలోని రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఐడీ ప్రూఫ్ చూపించి బదిలీ చేయించుకోవచ్చు. కానీ ఒక టికెట్ ని ఒక్కసారి మాత్రమే బదిలీ చేసుకోవచ్చు.

ఉచితంగా బోర్డింగ్ స్టేషన్ మార్పు (change in boarding station):
మనం ఒక స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నాం. కానీ అదే రూట్ లో మరో స్టేషన్ నుంచి ట్రెయినెక్కాల్సి రావచ్చు. అలాంటప్పుడు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు. టికెట్ బదిలీ తరహాలోనే ప్రయాణానికి 24 గంటల ముందు వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. అయితే ప్రింటవుట్ పట్టుకుని ఏ స్టేషన్ కీ వెళ్ళాల్సిన పని లేదు. ఆన్ లైన్ లోనే బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి