iDreamPost

వరల్డ్ కప్ ఓటమి.. హెడ్ కోచ్ గా ద్రవిడ్ పరిస్థితి ఏంటి?

వరల్డ్ కప్ 2023లో భారత జట్టుకు పరాభవం తప్పలేదు. ఇలాంటి తరుణంలో టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది.

వరల్డ్ కప్ 2023లో భారత జట్టుకు పరాభవం తప్పలేదు. ఇలాంటి తరుణంలో టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది.

వరల్డ్ కప్ ఓటమి.. హెడ్ కోచ్ గా ద్రవిడ్ పరిస్థితి ఏంటి?

వరల్డ్ కప్ 2023 మరోసారి నిరాశ పరిచింది. వరుస విజయాలతో ఫైనల్ చేరిన టీమిండియా ఆఖరి మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది. 140 కోట్ల మంది ఆశలు ఆవిరయ్యాయి. కానీ, ఎక్కడా మన జట్టుకు మద్దతు తగ్గలేదు. గెలుపు కోసం వాళ్లు శక్తికి మించి పోరాడారు. కప్పు కొట్టడానికి ప్రాణంపెట్టి ఆడారు. అయినా ఈసారి మనకు టైమ్ కలిసిరాలేదు. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడే మ్యాచ్ ఫలితంపై ప్రభావం మొదలైంది. ఇదిలా ఉండగా ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పరిస్థితి ఏంటనే కొత్త ప్రశ్న ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అతను పదవిలో కొనసాగుతాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

వరల్డ్ కప్ మీద పెట్టుకున్న కొండంత ఆశ నీరుగారిపోయింది. కానీ, ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రం టీమిండియాకి ఎంతో మంచి మద్దతు లభిస్తోంది. ప్రధాని మోదీ సైతం మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. మీరు ఎంతో మంచి జట్టు అంటూ ప్రశంసలు కురిపించారు. టీమిండియా ఓటమి బాధనే అభిమానులు తీసుకోలేకపోతుంటే ఇప్పుడు పిడుగులాంటి వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. భారత జట్టు ఇప్పుడు ఇంత మంచి ఫామ్ లో ఉంది అంటే అందుకు ఓ బలమైన కారణంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరును చెప్పచ్చు. జట్టును ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు. తిరుగులేని శక్తిగా టీమిండియాను తయారు చేశాడు. ఇప్పుడు వరల్డ్ కప్ 10 మ్యాచుల్లో వరుస విజయాలు సాధించింది అంటే అందుకు ద్రవిడ్ కూడా కారణం.

టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ టెన్యూర్ దాదాపుగా పూర్తైంది. మరి.. హెడ్ కోచ్ గా కొనసాగుతారా అనే ప్రశ్నకు.. హెడ్ కోచ్ గా తన భవిష్యత్ గురించి ఆలోచించలేదు అంటూ ద్రవిడ్ సమాధానం చెప్పాడు. అంటే కొనసాగుతాను అని గానీ.. కొనసాగను అని గానీ చెప్పలేదు. ఈ విషయంపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ని కొనసాగించాలి అనుకుంటే మరోమారు ద్రవిడ్ హెడ్ కోచ్ అవుతాడు. లేదు కొత్తవారిని తుసుకుందామనే నిర్ణయానికి వస్తే మాత్రం టీమిండియాకి త్వరలోనే ఒక కొత్త హెడ్ కోచ్ వస్తారు. అయితే బీసీసీఐ కొనసాగించాలని భావించినా కూడా.. ద్రవిడ్ అంగీకరిస్తాడా? అనే ప్రశ్న కూడా ఉంది. రాహుల్ ద్రవిడ్ గనుక నేను కొనసాగను అంటే మాత్రం కొత్త కోచ్ ని వెతుక్కోవాల్సిందే.

ఇంక టీమిండియా విషయానికి వస్తే.. నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభంకానుంది. 5 మ్యాచుల టీ20 సిరీస్ లో కంగారులతో టీమిండియా తలపడనుంది. మొదటి మ్యాచ్ విశాఖ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సిరీస్ డిసెంబర్ 3తో ముగుస్తుంది. ఆ తర్వాత టీమిండియా.. సౌత్ ఆఫ్రికాకు వెళ్తుంది. అక్కడ 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచుల్లో తలపడనుంది. డిసెంబర్ 10 నుంచి జనవరి 7 వరకు ఈ సిరీస్ కొనసాగుతుంది. తర్వాత అఫ్గనిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఉంటుంది. ఇలా టీమిండియా వరుస సిరీస్ లతో బిజీగా గడపనుంది. మరి.. రాహుల్ ద్రవిడ్ మళ్లీ హెడ్ కోచ్ గా కొనసాగాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి