iDreamPost

Radhe Shyam Postponed : ప్రభాస్ సినిమా మీద ఓమిక్రాన్ పంజా

Radhe Shyam Postponed : ప్రభాస్ సినిమా మీద ఓమిక్రాన్ పంజా

భయపడినంతా అయ్యింది. సంక్రాంతికి పాన్ ఇండియా సినిమా ఒకటుందన్న ఉత్సాహాన్ని నీరు గారుస్తూ రాధే శ్యామ్ వాయిదా పడింది. అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ యుఎస్ తదితర విదేశీ డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఇక్కడి పంపిణీదారులకు ఆ మేరకు సమాచారం వెళ్లిందట. ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. యుఎస్ లో ఓమిక్రాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పది లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ల మీద ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అడ్వాన్స్ బుకింగ్ ఈ కారణంగానే మొదలుపెట్టకుండా వేచి చూస్తూ వచ్చారు. ఆర్ఆర్ఆర్ విషయంలో జరిగింది రిపీట్ కాకుండా జాగ్రత్త పడ్డారు

ఇక దేశీయంగా చూస్తే చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, యాభై శాతం ఆక్యుపెన్సీలు అమలవుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలో గత ఏడాది లాగే సిచువేషన్ అవుట్ అఫ్ కంట్రోల్ అయ్యేలా ఉంది. కర్ణాటక, కేరళలో ఆంక్షలు తీవ్రమయ్యాయి. మనకూ దగ్గరలో ఇవి మొదలయ్యే ఛాన్స్ ని కొట్టిపారేయలేం. ఇన్ని రిస్కులు మధ్య రాధే శ్యామ్ ని తీసుకురావడం వల్ల కలిగే నష్టం భారీగా ఉంటుంది. అందుకే ప్రమోషన్లు ఇంటర్వ్యూలు హఠాత్తుగా ఆపేశారు నిర్మాతలు. లేదంటే నిన్నా మొన్నా కలిపి చాలానే ప్లాన్ చేశారు. అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. నిన్న దర్శకుడు రాధాకృష్ణ పెట్టిన ట్విట్ లో ఇన్ డైరెక్ట్ గా ఈ విషయాన్నే చెప్పడం గమనించవచ్చు.

ఇక కొత్త డేట్ పరిశీలనలో రాధే శ్యామ్ టీమ్ ఉంది. మార్చి 18 ఒక ఆప్షన్ గా పరిశీలిస్తున్నారట. ఏప్రిల్ లో ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, ఎఫ్3, బీస్ట్ ఉన్నాయి కాబట్టి దానికన్నా ముందే వస్తే బెటరనే ఆలోచన చేస్తున్నారని తెలిసింది. నిన్నా మొన్న సోషల్ మీడియాలో జరిగిన ఓటిటి ప్రచారం ఉత్తిదే అయినట్టు ఉంది. మూడు వందల కోట్లకు పైగా ఆఫర్ వచ్చిందని అన్నారు కానీ ఏ మేరకు నిజమో తెలియదు. భవిష్యత్తులో థియేటర్ రిలీజ్ చేసినా ఓటిటి విండో మాత్రం తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తర్వాత ప్రభాస్ అభిమానులు బ్యాడ్ న్యూస్ వినక తప్పలేదు

Also Read : Bellamkonda Sreenivas : ఛత్రపతి హిందీ రీమేక్ కు కలిసి వస్తోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి