iDreamPost

Radhe Shyam : ముందూ వెనుకా చూస్తున్న పాన్ ఇండియా సినిమా

Radhe Shyam : ముందూ వెనుకా చూస్తున్న పాన్ ఇండియా సినిమా

జనవరి 14కి సరిగ్గా పది రోజుల సమయం మాత్రమే ఉంది. రాధే శ్యామ్ ప్రమోషన్లు ఇంకా వేగమందుకోలేదు. నిన్న ప్లాన్ చేసుకున్న ప్రభాస్ ఇంటర్వ్యూలను ఉన్నట్టుండి రద్దు చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇంతకీ సినిమా వస్తుందా రాదా అనే అయోమయంలో సగటు ప్రేక్షకులు ఉన్నారు. యువి మాత్రం ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం లేదన్నట్టుగా ఫీలర్లు వదులుతోంది. రేపు లేదా ఏడో తేదీన ఒక నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రకటిస్తారనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. పండగ బరిలో ఉన్న పాన్ ఇండియా మూవీ ఇదొక్కటే కావడంతో నార్త్ ఆడియన్స్ లోనూ ప్రభాస్ ఇమేజ్ దృష్ట్యా దీని మీద విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు.

నిర్మాతలు ముందు ఇప్పుడు మూడు ఆప్షన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటిది పరిస్థితులు ఎలా ఉన్నా, కేసులు పెరిగినా తగ్గినా, ఏపిలో టికెట్ రేట్ల వ్యవహారం కొలిక్కి రాకపోయినా 14 విడుదలకు కట్టుబడి ఉండటం. రెండోది వాయిదా వేయడం. ఆర్ఆర్ఆర్ తరహాలో వెనక్కు తగ్గడం. మూడోది సుమారు నాలుగు వందల కోట్ల దాకా ఉన్న డైరెక్ట్ ఓటిటి ఆఫర్లను పరిగణనలోకి తీసుకోవడం. వీటి మీదే సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ఓవర్సీస్ లోనూ బాక్సాఫీస్ సిచువేషన్ ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే యుఎస్ లాంటి మెయిన్ సెంటర్స్ లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయలేదు. ఇప్పటికే ఆలస్యమైపోయింది.

ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానికి సంబంధించిన ప్లస్సులు మైనస్సులు సమానంగా ఉన్నాయి. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ లేదన్న ఒకే కారణంలో చిన్న సినిమాలు ముప్పేటలా దాడి చేస్తున్నాయి. రాధే శ్యామ్ కూడా రాదన్న నమ్మకం కొన్ని యూనిట్లలో కనిపిస్తోంది. 14కే మూడు నాలుగు సినిమాలు షెడ్యూల్ చేస్తున్నారంటే దాని వెనుక ఉన్న ధైర్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. టైం చాలా తక్కువగా ఉండటంతో యువి మీద ఒత్తిడి పెరుగుతోంది. ప్రమోషన్లు చేసినా చేయకపోయినా ముందైతే డెసిషన్ తీసుకుంటే ఆ తర్వాత జనానికి ఎలా రీచ్ చేయాలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈసారి టాలీవుడ్ సంక్రాంతి థ్రిల్లర్ మించిన సస్పెన్స్ ని ఇస్తోంది

Also Read : Disha Patani : రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి