iDreamPost

Radhe Shyam : అన్నివైపులా ఒత్తిడిలో ప్రభాస్ బృందం

Radhe Shyam : అన్నివైపులా ఒత్తిడిలో ప్రభాస్ బృందం

మన సినిమా మీద ఎంతైనా నమ్మకం ఉండొచ్చు. కంటెంట్ బలమైనదే కావొచ్చు. వందల కోట్ల పెట్టుబడితో పాన్ ఇండియా లెవెల్ లో తీసిందే అవ్వొచ్చు. కానీ ఇవన్నీ ఎలా ఉన్నా ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఈ రోజుల్లో దేనికైనా ప్రమోషన్ చాలా కీలకం. ఇది అవసరం లేదనుకుంటే ఆర్ఆర్ఆర్ కు రాజమౌళి ఇన్ని స్కెచ్చులు వేయడం ఎందుకు. ఒక సాంగ్ లాంచ్ కోసం మల్టీ ప్లెక్సుకు మీడియాని పిలిచి దాన్ని చూపించి మాట్లాడాల్సిన అగత్యం అంతకన్నా లేదు. కానీ తప్పదు. జనానికి చేరువ కావాలన్నా మరింత బలంగా సోషల్ మీడియాలో మన గురించి మాట్లాడుకోవాలన్నా ఇదంతా చేసుకోవాల్సిందే. నిన్న ట్విట్టర్ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది.

కానీ ఈ విషయంలో రాధే శ్యామ్ నిర్లిప్తత ఎంతకూ తగ్గడం లేదు. మొన్నామధ్య ఎవరో నీవెవరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశాక మళ్ళీ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు దాని హిందీ వెర్షన్ ని వేరే ట్యూన్ తో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఒక్కో పాటకు ఒక్కో భాషలో ఇంతేసి టైం తీసుకుంటే అసలు టీజర్, ట్రైలర్, ఇతరత్రా ప్రమోషనల్ మెటీరియల్ ని ఎప్పుడు బయటికి తీసుకొస్తారనే ప్రశ్న తలెత్తడం సహజం. ఆల్మోస్ట్ నవంబర్ పూర్తయిపోయింది. అది మినహాయిస్తే చేతిలో ఉన్నది సరిగ్గా 44 రోజులు. ఒకపక్క ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు భీమ్లా నాయక్ కూడా రేస్ లో ఉంది. బంగార్రాజుని మరీ తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు.

ఇంత టైట్ సిచువేషన్ లో రాధే శ్యామ్ టీమ్ ఇంకా చురుకుగా ఉండాలి. ఇలా అయితే లాభం లేదనేది అభిమానుల మాట. ఇది కాదనలేం. కళ్ళముందు కనిపిస్తోంది అలాగే ఉంది మరి. నిజానికి సంక్రాంతి సినిమాల్లో కాస్త తక్కువ హంగామా జరుగుతోంది రాధే శ్యామ్ కే. ప్రభాస్ కటవుట్ ఉంటే చాలు ఇంకేమి అక్కర్లేదనే భావన నుంచి యువి బయటికి వస్తే బెటర్. బాహుబలి చరిత్ర తర్వాత సాహో తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా నిరాశపరిచింది. సో రాధే శ్యామ్ ఆ గాయాన్ని పూర్తిగా మాన్పుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Allu Arjun : అంతుచిక్కని ఐకాన్ స్టార్ ప్లానింగ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి